Prashanth Neel: సలార్ మూవీ అంచనాలను మించి ఉంటుందా.. ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో ఒకరైన ప్రశాంత్ నీల్ మరో 80 రోజుల్లో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సలార్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయనుందని అభిమానులు ఫీలవుతున్నారు. అయితే ప్రశాంత్ నీల్ సైతం జక్కన్నలా మారుతున్నారని తెలుస్తోంది. సలార్ సినిమా బెటర్ ఔట్ పుట్ కోసం కీలక మార్పులు చేస్తున్నారని సమాచారం. సలార్ ట్రైలర్ తోనే ప్రేక్షకులకు సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది.

సలార్ మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు 2023 సంవత్సరం విజేత ఈ సినిమానే అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సలార్ సినిమా సంచలనాలు సృష్టించడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు సంబంధించి సైలెంట్ గా కొన్ని షాట్స్ రీషూట్ కూడా చేస్తున్నారని సమాచారం.

సలార్ సినిమాకు రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన నేపథ్యంలో ప్రశాంత్ నీల్ ఎలాంటి తప్పటడుగులు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సలార్, డంకీ రేసులో సలార్ విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రశాంత్ నీల్ కు పోటీగా ఏ సినిమా విడుదలైనా ఆ సినిమా మెజారిటీ సందర్భాల్లో నష్టపోతుండటం గమనార్హం.

ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తర్వాత సినిమాలు సైతం భారీ రేంజ్ లో ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసే విధంగా తన సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ సలార్, సలార్2 సినిమాలకు భారీ రేంజ్ లో పారితోషికం అందుకున్నారు. ప్రశాంత్ నీల్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus