Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

ఎన్టీఆర్  (Jr NTR) హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కుతుంది.’మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. 2022 చివర్లో ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేయగా.. 2023 మే నుండి షూటింగ్ మొదలువుతుంది అని కూడా స్పష్టంచేశారు. కానీ ఎన్టీఆర్ లైనప్పుల కారణంగా 2 ఏళ్ళు డిలే అయ్యింది ఈ ప్రాజెక్టు. మొత్తానికి ఈ ఏప్రిల్ 22న స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ అయ్యింది.

Jr NTR

సినిమాలో పాన్ ఇండియా క్యాస్టింగ్ ఉన్నట్టు సమాచారం. మొదటి షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంతో ఎన్టీఆర్ కూడా ఇటీవల హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక నెక్స్ట్ షెడ్యూల్ మే 18 నుండి మొదలవుతుంది అని అంటున్నారు. ఎన్టీఆర్ లేని పోర్షన్ కూడా ఇప్పటికే కొంత షూట్ చేశారు. మరోపక్క ఎన్టీఆర్ పుట్టినరోజు కూడా వస్తుంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. కాబట్టి… అభిమానులు ఎన్టీఆర్ సినిమాల అప్డేట్స్ గట్టిగానే డిమాండ్ చేస్తారు.

ఈ విషయంలో మైత్రి సంస్థ ఎటువంటి లోటు చేయదు. సినిమాని మార్కెటింగ్ చేయడంలో వాళ్ళ తర్వాతే ఎవ్వరైనా. హీరో పుట్టినరోజు వస్తుంది అంటే చాలు కచ్చితంగా… అతని సినిమాకి సంబంధించి ఏదో ఒక అప్డేట్ రెడీ చేసి ఉంచుతారు. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్.. ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఒక గ్లింప్స్ రెడీ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఈ.. గ్లింప్స్ ఉంటుందని… ‘డ్రాగన్’ వరల్డ్ ని కొంత పరిచయం చేసే విధంగా కూడా అనిపిస్తుందని అంటున్నారు.

థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీకి ఇచ్చేస్తున్నారు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus