Prashanth Neel, Nani: నీల్‌ బొగ్గు లుక్‌లోని నేచురల్‌ స్టార్‌ వస్తాడా!

అస్సలు కుదరిన కాంబినేషన్‌ ఇది, ఈ కాంబినేషన్‌ ఎలా కుదురుతుందబ్బా, ఏ లెక్కన చూసినా ఆ ఇద్దరికీ సెట్‌ అవ్వదు, ఏంటి జోక్‌ చేస్తున్నావా వాళ్లు సినిమా తీయడమేంటి… ఇలాంటి కామెంట్లు గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ కనిపిస్తున్నాయి. ఇదెవరి కోసమో మీకు ఇప్పటికే అర్థమైపోయుంటుంది. లేదంటే ఈ వార్త ఒకసారి చదవండి మీకు కూడా పై డౌట్స్‌లో ఏదో ఒకటి వస్తుంది. ఎందుకంటే వైరల్‌ అవుతున్న కాంబినేషన్‌ అలాంటిది మరి.

‘కేజీయఫ్‌’ సినిమాలతో ఎలివేషన్‌ కింగ్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఒక్క సినిమాతో మొత్తం టాలీవుడ్‌ మాస్‌ హీరోలు, మాస్‌ స్టార్‌లు మొత్తం ఆయన వెంటపడుతున్నారు అని చెప్పొచ్చు. అలాంటి ప్రశాంత్‌ నీల్‌తో నేచురల్‌ స్టార్‌, బాయ్‌ నెక్స్ట్‌ డోర్‌గా పేరు తెచ్చుకున్న నాని నటిస్తున్నాడు అంటే పైన మేం చెప్పిన డౌట్లే వస్తాయి మరి. కానీ ఇప్పుడు ఈ కాంబినేషన్‌ బాగా వైరల్‌ అవుతోంది. మీరు కూడా చూసే ఉంటారు.

హోంబలే ఫిల్మ్స్‌ నిర్మాణంలోనే ప్రశాంత్‌ నీల్‌ – నాని సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే ఇద్దరి జోనర్‌లు ఏ కోశాన కూడా ఒక సైడ్‌కి రావు. అలాంటిది ఇద్దరూ సినిమా ఎలా చేస్తారు అనే ప్రశ్న వినిపిస్తోంది. మొన్నీ మధ్య వచ్చిన ‘దసరా’ లుక్‌లో నాని రగ్‌డ్‌ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ప్రశాంత్‌ నీల్‌ సినిమా అంటే అలాంటి లుక్‌ ఒకటి ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు. మరి వరుసగా ఇలాంటి సినిమానే అంటే ఫ్యాన్స్‌కి ఓకేనా అనేది చూడాలలి.

అయితే ఇక్కడే ఇంకో మాట వినిపిస్తోంది. వరుసగా ఒకేలాంటి సినిమాలు తీయడం ఇష్టం లేక నానితో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీయాలని ప్రశాంత్‌ నీల్‌ అనుకుంటున్నారని, అందుకే నాని హీరోగా సినిమా చేయాలని చూస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే ఆలోచన అయితే ప్రశాంత్‌ నీల్‌ – నాని సినిమా వచ్చే అవకాశం ఉంది. చూద్దాం గతంలో ప్రశాంత్‌ నీల్‌ చెప్పిన లైనప్‌ అయితే ‘సలార్‌’, ‘ఎన్టీఆర్‌ 31’, ‘ఉగ్రమ్‌’ మురళి సినిమా తర్వాత యశ్‌తో సినిమా ఉన్నాయి. మరి నాని సినిమా ఎక్కడ ఉంటుందో చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus