తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన హనుమాన్ మూవీ రిలీజ్ కు మరో 10 రోజుల సమయం మాత్రమే ఉంది. హనుమాన్ సినిమాకు సైతం భారీ స్థాయిలోనే థియేటర్లు దక్కే ఛాన్స్ ఉండగా టాక్ ఆధారంగా ఈ సినిమా కలెక్షన్లు పెరిగే లేదా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
హనుమాన్ హిట్టైతే అవతార్ కంటే పెద్ద సినిమా తీస్తానని ప్రశాంత్ వర్మ (Prashanth Varma) కామెంట్లు చేశారు. కొంతమంది ఈ కామెంట్ల గురించి నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నా ప్రశాంత్ వర్మ కాన్ఫిడెన్స్ ను ఎక్కువమంది ప్రశంసిస్తున్నారు. ప్రశాంత్ వర్మలో టాలెంట్ పుష్కలంగా ఉందని టాలెంట్ ను సరిగ్గా వాడుకుంటే సక్సెస్ కచ్చితంగా సొంతమవుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. బుక్ మై షోలో కూడా హనుమాన్ ను చూడటానికి ఆసక్తి ఉందని చాలామంది సినీ ప్రియులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
సంక్రాంతి కానుకగా ఐదు సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ప్రతి సినిమా థియేటర్ల విషయంలో కొంతమేర నష్టపోక తప్పదు. టాలీవుడ్ లో తీవ్రమైన పోటీ ఉండటంతో సంక్రాంతికి డబ్బింగ్ సినిమాల రిలీజ్ లేనట్టేనని క్లారిటీ వచ్చేసింది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన డబ్బింగ్ సినిమాలు తెలుగు వెర్షన్ మాత్రం ఆలస్యంగా రిలీజ్ కానుండటం గమనార్హం. కెప్టెన్ మిల్లర్, అయలాన్ సినిమాలు తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాయో చూడాలి.
2024 సినీ ప్రియులకు స్పెషల్ ఇయర్ గా ఉండబోతుందని సమాచారం అందుతోంది. సంక్రాంతి సినిమాల పోటీలో ఎవరూ వెనక్కు తగ్గలేదు. డబ్బింగ్ సినిమాలకు బిజినెస్ జరగకపోవడం వల్లే రిలీజ్ డేట్లను మార్చారని తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న సినిమాలలో ఏ సినిమా ఎన్ని థియేటర్లలో విడుదలవుతుందో చూడాల్సి ఉంది. సంక్రాంతి సినిమాలు బాక్సాఫీ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!