Prashanth Varma: మాకు ఎన్టీఆరే రాముడు, కృష్ణుడు.. ప్రశాంత్ చెప్పిన విషయాలివే!

హనుమాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ప్రశాంత్ వర్మ పేరు సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగుతోంది. సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో రామాయణం, మహాభారతం ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయని సీనియర్ ఎన్టీఆర్ ఇలాంటివి ఎన్నో చేశారని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. కానీ ఎప్పుడూ విమర్శలు ఎదుర్కోలేదని ఆయన చెప్పుకొచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదలైన సమయంలో ప్రేక్షకులు పండుగ చేసుకునేవాళ్లని మాకు ఎన్టీఆరే రాముడు, కృష్ణుడు అని కామెంట్లు చేశారు.

చాలా ఇళ్లలో దేవుడి విగ్రహాలతో పాటు ఎన్టీఆర్ పోస్టర్లు ఉంటాయని ప్రశాంత్ వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. టాలీవుడ్ సినిమాలలో దేవుళ్లను ఎప్పుడూ తప్పుగా చూపించలేదని ఆయన కామెంట్లు చేశారు. నేను ఈ జోనర్ లో వచ్చిన సినిమాలన్నీ చూస్తానని ప్రశాంత్ వర్మ వెల్లడించారు. కొన్ని సినిమాలను చూసినప్పుడు ఎలా తీయాలో తెలుసుకుంటానని మరికొన్ని సినిమాలను చూసిన సమయంలో ఎలా తీయకూడదో తెలుసుకుంటానని ఆయన అన్నారు.

ఇలాంటి సున్నితమైన అంశాలను మాత్రం జాగ్రత్తగా తెరకెక్కించాలని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. నేను ఇతర డైరెక్టర్ల గురించి మాట్లాడాలని అనుకోవడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. మన సంస్కృతిని, చరిత్రను ఎప్పుడూ తప్పుగా చూపించనని ఆయన అన్నారు. రామాయణ మహాభారతాలను నేటి ప్రేక్షకులకు నా శైలిలో చెప్పలనుకుంటున్నానని ప్రశాంత్ వర్మ అభిప్రాయపడ్డారు.

కానీ వాటిని తీసేంత అనుభవం లేదని వాటి స్పూర్తితో కొన్ని కల్పిత కథలను రూపొందిస్తున్నానని ప్రశాంత్ వర్మ కామెంట్లు చేశారు. మా దగ్గర ఎక్కువ బడ్జెట్ లేదని కావాల్సినంత సమయం ఉందని ఆయన వెల్లడించడం గమనార్హం. ప్రశాంత్ వర్మ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ వర్మ రెమ్యునరేషన్ సైతం పెరిగిందని సమాచారం అందుతోంది. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus