సైలెంట్ గా పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు.. ఫోటోలు వైరల్!

Ad not loaded.

బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియా బెన‌ర్జీ (Priya Banerjee) తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. ఈమె టాలీవుడ్ హీరోలు అయినటువంటి అడివి శేష్ (Adivi Sesh) తో ‘కిస్’ (Kiss), సందీప్ కిష‌న్ తో (Sundeep Kishan) ‘జోరు’ (Joru), నారా రోహిత్ తో (Nara Rohit) ‘అసుర’ (Asura) వంటి సినిమాల్లో నటించింది. ఈ బ్యూటీ తాజాగా ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు ప్రతీక్ బబ్బర్నిని వివాహం చేసుకుంది.కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట ప్రేమికుల‌రోజున (14 ఫిబ్రవరి 2025 న) పెళ్లి చేసుకున్నారు. ప్రతీక్ బబ్బర్ జన్నే ‘తు యా జానే నా’, ‘బాగి 2’, ‘ధోబి ఘాట్’, ‘దమ్ మారో దమ్’ వంటి చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యాడు.

Prateik Babbar , Priya Banerjee

అత‌డు ప్రియా బెన‌ర్జీతో చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నాడు. ఇక తాజాగా ఈ జంట తమ వివాహాన్ని ధృవీకరిస్తూ కొన్ని పెళ్లి ఫోటోల‌ను సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా ప్రస్తుతం అవి వైర‌ల్ అవుతున్నాయి. ఇటీవ‌ల ప్రియా బెనర్జీ తన ఇన్‌స్టాలో పెళ్లికి సంబంధించిన కొన్ని గ్లింప్స్‌ను షేర్ చేయగా ఈ విషయం బయట పడింది. ఈ పెళ్లిలో ప్రతీక్ బబ్బర్ పెళ్లి మండపానికి వచ్చి, తన పక్కన కూర్చోవడం చూసి ప్రియా భావోద్వేగానికి గురైన క్షణానికి సంబంధించిన ఫోటోల‌ను ఆమె షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

దీంతో నెటిజన్లు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇకపోతే ప్రతీక్ బబ్బర్ రాజ్ బబ్బర్ – దివంగత నటి స్మితా పాటిల్ దంప‌తుల‌ కుమారుడన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. కాగా అత‌డి త‌ల్లి కొన్ని కారణాల వలన కొన్నాళ్ల క్రితం మరణించ‌డం ఒక విషాదం. దాంతో పెళ్లిలో త‌న త‌ల్లిని సంస్మ‌రిస్తూ నివాళుల‌ర్పించాడు ఈ హీరో. ఈ పెళ్లిలో, తరుణ్ తహిలియాని రూపొందించిన కస్టమ్ వివాహ దుస్తులలో న‌వ‌వ‌ధూవ‌రులు క‌నిపించారు. ఇక వీరి పెళ్లి ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

రష్మిక మళ్ళీ టార్గెట్ అయ్యిందిగా… మేటర్ ఏంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus