నారా రోహిత్ (Nara Rohit) హీరోగా ‘ప్రతినిథి’ (Prathinidhi) సినిమా వచ్చింది. అది డీసెంట్ సక్సెస్ అందుకుంది. 2014 ఎన్నికల టైంకి వచ్చిన ఈ సినిమా.. ఆ టైంలో టీడీపీ అభిమానులకి, ఆ పార్టీకి మంచి మైలేజ్ అందించింది అని చెప్పొచ్చు.టీవీల్లో కూడా ఈ సినిమాని బాగా చూశారు. మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత దీనికి సీక్వెల్ గా ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2) వచ్చింది.ఈసారి కూడా టీడీపీ పార్టీకి, నేతలకి, అభిమానులకి ఈ సినిమా మంచి జోష్ ఇస్తుందని అంతా భావించారు.
సీనియర్ జర్నలిస్ట్ మూర్తి (Murthy Devagupthapu) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. మే 10 న రిలీజ్ అయిన ఈ సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు. ఇందులో కూడా వైసీపీ శ్రేణులపై సెటైర్లు ఉన్నాయి. ప్రమోషన్స్ లోపం, సెన్సార్ ఇష్యూస్ వల్లనో ఏమో కానీ ఈ సినిమా ఫలితం నిరాశపరిచింది. సరే థియేటర్లలో ఈ సినిమా సక్సెస్ కాలేదు.
కనీసం ఓటీటీలో అయినా రిలీజ్ అయితే చూద్దామని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కానీ ఎందుకో ఓటీటీలో కూడా ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. దీని తర్వాత రిలీజ్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఎందుకో ‘ప్రతినిథి 2’ ఓటీటీ రిలీజ్ ఆలస్యం అవుతుంది. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. దీనికి ఓటీటీ బిజినెస్ పెండింగ్లో ఉందట. ఏ ఆఫర్ రాకపోతే వ్యూయర్ షిప్ బేస్ పై స్ట్రీమింగ్ కి ఇచ్చేయాలని టీం భావిస్తున్నట్టు సమాచారం.