నా స్థానంలో మరొకరు ఉంటే సూసైడ్ చేసుకునేవారు: ప్రీతమ్

ప్రీతమ్ జుకాల్కర్ పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ డిజైనర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే పలువురు స్టార్ సెలబ్రిటీలకు పర్సనల్ డిజైనర్గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న సమయంలో ఈయన పేరు పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. కేవలం ఇతని కారణంగానే సమంత నాగచైతన్య ఇద్దరు విడాకులు తీసుకున్నారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇలా తన గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలపై మౌనం వహించినటువంటి ప్రీతమ్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన సమంత నాగచైతన్య గురించి వారి విడాకుల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రీతమ్ మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో సమంత తనకు చాలా సపోర్ట్ గా నిలిచిందని తెలియజేశారు. అయితే సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న సమయంలో చాలామంది తనని కారణంగా చూపించారని ఈయన తెలియజేశారు.

సమంత కేవలం తనతో కలిసి దిగినటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి డిలీట్ చేయడమే ఇందుకు కారణం అని తెలియజేశారు . ఇక మా ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని భావిస్తున్నారు. మా ఇద్దరి మధ్య ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్ ఉందని ఆలోచించవచ్చు కదా అంటూ తెలిపారు. నా స్థానంలో మరొకరు కనుక ఉంటే ఈపాటికి సూసైడ్ చేసుకొని చనిపోయేవారు అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

సమంత చాలా మంచి అమ్మాయి తను ఇప్పటికీ నాకు చాలా సపోర్ట్ గా నిలిచారని తెలియజేశారు. ఇక నాగచైతన్య గురించి కూడా మాట్లాడుతూ తను కూడా చాలా మంచి వాడిని చాలా హంబుల్ పర్సన్ అంటూ చైతన్య గురించి ప్రీతమ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus