Premalu OTT: ఆ ప్రముఖ ఓటీటీలో ప్రేమలు మూవీ స్ట్రీమింగ్ కానుందా?

గత శుక్రవారం థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమాలలో ప్రేమలు (Premalu)  సినిమా ఒకటి. మమితా బైజు హీరోయిన్ గా నటించిన ఈ సినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. కార్తికేయ డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేయడం ఈ సినిమాకు కలిసొచ్చింది. రాజమౌళి (Rajamouli)  ప్రమోట్ చేయడం, మహేష్ బాబు (Mahesh) పాజిటివ్ గా ప్రస్తావించడం ప్రేమలు సక్సెస్ కు ఒక విధంగా కారణమని చెప్పవచ్చు. ఈ సినిమా ఈ నెల 29వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

అధికారికంగా ఇందుకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. మార్చ్ 15వ తేదీన ఈ సినిమా తమిళంలో థియేటర్లలో విడుదల కానుంది. చిన్న సినిమాగా విడుదలైన ప్రేమలు మూవీ పాన్ ఇండియా స్థాయిలో హిట్ గా నిలిచింది. ప్రేమలు ఓటీటీలో కూడా ఊహించని స్థాయిలో హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ప్రేమలు సినిమా హీరోయిన్ మమితా బైజు (Mamitha Baiju) ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా ఆమెకు సంబంధించిన విషయాలు, విశేషాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రాజమౌళి ప్రశంసలు పొందడంతో సోషల్ మీడియా వేదికగా ఈ బ్యూటీ గురించి చర్చ జరుగుతోంది. ప్రేమలు మలయాళంలో 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుందని సమాచారం అందుతోంది. ప్రేమలు సక్సెస్ తో మమితా బైజుకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు రాగా మంచి ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఈ బ్యూటీకి కెరీర్ పరంగా తిరుగుండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మమితా బైజు రెమ్యునరేషన్ సైతం పెరిగిందని తెలుస్తోంది. భాషతో సంబంధం లేకుండా క్రేజ్ ను పెంచుకుంటున్న మమితా బైజు రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus