Premi Viswanath: ‘కార్తీక దీపం’ సీరియల్ నటికి బంపర్ ఆఫర్..!

‘కార్తీక దీపం’ సీరియ‌ల్‌ ను బుల్లితెర ‘బాహుబలి’ గా పోలుస్తుంటారు. ఓ దశలో ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ విషయంలో క్రియేట్ చేసిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కాదు. దేశవ్యాప్తంగా కూడా హైయెస్ట్ టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసిన సీరియల్ గా రికార్డులకెక్కింది.ఈ చిత్రంలో నటించిన నటీనటులంతా చాలా ఫేమస్.ముఖ్యంగా వంటలక్క అలియాస్ దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్ కు తెలుగులో నెలకొన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

Click Here To Watch Trailer

డాక్ట‌ర్ బాబు భార్యగా ఇద్ద‌రు క‌వ‌ల పిల్ల‌ల త‌ల్లిగా నటించిన ఈమె ఫ్యామిలీ ఆడియెన్స్ ను మాత్రమే కాదు మాస్ ఆడియెన్స్ ను కూడా అలరించింది. సోషల్ మీడియాలో ఈమె పై బోలెడన్ని మీమ్స్ జెనెరేట్ అయ్యేవి.అయితే వంటలక్క పాత్ర ఈ మధ్య కాలంలో కనిపించడం లేదు. ఆమె పాత్ర అలాగే డాక్టర్ బాబు పాత్ర చనిపోయినట్టు చూపించి శుభం కార్డు వేసేశాడు దర్శకుడు.హిమ‌, శౌర్య పాత్ర‌ల‌ చుట్టూనే ప్రస్తుతం ఈ సీరియల్ నడుస్తుంది. అందువల్ల రేటింగ్ కూడా పడిపోయింది.

వంటలక్క పాత్ర లేకపోవడంతో ఆమె ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. అయితే ప్రేమి విశ్వ‌నాథ్‌ ప్రస్తుతం సినిమాల్లో నటించాలని చూస్తుందట. గ‌తంలో కూడా ఈమెకు బోలెడన్ని సినిమా ఆఫ‌ర్లు తలుపుతట్టినా.. సీరియల్ షూటింగ్ కు ఇబ్బంది కలుగుతుందని ఈమె ఒప్పుకోలేదట. అయితే ఇప్పుడు ‘కార్తీక్ దీపం’ సీరియల్ కు ఆమె కాంట్రాక్ట్ ఫినిష్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఆమెకు సినిమాల్లో నటించడానికి అడ్డంకి లేదు. ఈ క్రమంలో ఆమె ఓ సినిమా చేయడానికి కూడా ఫైన్ చేసినట్టు వినికిడి.

వివరాల్లోకి వెళితే… నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ కు అవకాశం దక్కిందట.సినిమాలో ఆమెది చాలా ముఖ్యమైన పాత్రని తెలుస్తుంది. అయితే దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus