Ooru Peru Bhairavakona: ‘…భైరవకోన’ ఇంకో పార్ట్‌ కూడా ఉందట.. కానీ ఓ మెలిక!

Advertisement

తర్వాతి సంగతి తర్వాత చూద్దాం. ముందు సీక్వెల్‌ ఉందని లీక్‌ చేసేయండి, సినిమా ఎండ్‌ కార్డ్స్‌లో వేసేయండి అని సినిమా బృందం అనుకుంటున్న రోజులివి. అదేంటి ఇలా అంటున్నారు అనుకుంటున్నారా? కావాలంటే మీరే చూసుకోండి ఎన్ని సినిమాలు సీక్వెల్స్‌, ప్రీక్వెల్స్‌ ఉంటాయని చెప్పి… ఆగిపోలేదో. ఆ విషయం తర్వాత చూద్దాం. ఇప్పుడు అయితే ఓ సినిమాకు ప్రీక్వెల్‌ ఉంది కానీ… ఆ విషయం ఎండ్‌ కార్డ్స్‌లో వేయం అని అంటున్నారు.

సందీప్‌ కిషన్‌, వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రల్లో వీఐ ఆనంద్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఊరి పేరు భైరవకోన’. చాలా వాయిదాల తర్వాత ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నిర్మాత రాజేష్‌ దండా మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో సినిమా గురించి మాట్లాడుతూ… ఈ చిత్రానికి ప్రీక్వెల్‌ అవకాశం ఉందని చెప్పారు. అయితే ఆ విషయాన్ని సినిమా ఎండ్‌ టైటిల్స్‌లో వేయడం లేదని చెప్పారు. అంటే ఫలితం బట్టి ప్రకటిస్తారన్నమాట.

సందీప్‌, వీఐ ఆనంద్‌, తాను మంచి మిత్రులమని చెప్పిన రాజేశ్‌… డిస్ట్రిబ్యూటర్‌గా 12 ఏళ్లుగా పరిశ్రమలోనే ఉన్నానని చెప్పారు. నిర్మాతగా తొలుత అనుకున్న సినిమా ‘ఊరు పేరు భైరవకోన’ అని… కానీ వివిధ కారణాల వల్ల సినిమా కాస్త ఆలస్యంగా మా బ్యానర్‌లో మూడో సినిమాగా రిలీజ్‌ అవుతోంది అని చెప్పారు. అలాగే ఈ చిత్రంతో (Ooru Peru Bhairavakona) తమ బ్యానర్‌లో హ్యాట్రిక్‌ కొడతామనే నమ్మకం ఉందని చెప్పారాయన.

ఫాంటసీ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ తరహాలో ఈ సినిమా ఉంటుందని, గరుడ పురాణంలో కనిపించకుండా పోయిన నాలుగు పేజీలకు ఈ కథకు ఉన్న లింక్‌ ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు. ‘భైరవకోన’ ఊరులో జరిగే చిత్రమైన సంఘటనలు, అందులోని ట్విస్ట్‌లు అదిరిపోతాయని అంటున్నారాయన. ఇక తమ బ్యానర్‌లో ప్రస్తుతం అల్లరి నరేశ్‌తో ‘బచ్చల మల్లి’ అనే సినిమా చేస్తున్నామని చెప్పారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జులైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందకొస్తుంది. మరోవైపు కిరణ్‌ అబ్బవరంతో ఓ సినిమా ఉందని కూడా చెప్పారు.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus