Prince Collections: ఇంకా 50 శాతం కూడా రికవరీ చేయలేకపోయింది

‘వరుణ్ డాక్టర్’ ‘కాలేజ్ డాన్’ వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి ఫుల్ ఫామ్లో ఉన్నాడు శివ కార్తికేయన్. అతను ఈసారి ఓ తెలుగు దర్శకుడితో సినిమా చేశాడు. అదే ‘ప్రిన్స్’ సినిమా.’జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కెవి ఈ చిత్రానికి దర్శకుడు.తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 21న దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు లు కలిసి ‘శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి’, ‘సురేష్ ప్రొడక్షన్స్’, ‘శాంతి టాకీస్’ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.

మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ కొంతవరకు పర్వాలేదు అనిపించాయి.అయితే కాంపిటీషన్ వలనో లేక తక్కువ థియేటర్లలో సినిమా రిలీజ్ అవ్వడం వల్లనో లేక టాక్ వల్లనో కానీ కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.93 cr
సీడెడ్ 0.25 cr
ఉత్తరాంధ్ర 0.38 cr
ఈస్ట్+వెస్ట్ 0.25 cr
కృష్ణా + గుంటూరు 0.36 cr
నెల్లూరు 0.18 cr
ఏపి+ తెలంగాణ 2.35 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్)+
ఓవర్సీస్(తెలుగు వెర్షన్)
0.13 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 2.48 cr (షేర్

‘ప్రిన్స్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.5.28 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. చాలా వరకు.. నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవడానికి రూ.5.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ మూవీ కేవలం రూ.2.48 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ కు మరో రూ.3.02 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పోటీగా ‘ఓరి దేవుడా’ ‘సర్దార్’ ‘కాంతారా’ వంటి సినిమాలు ఉండటంతో ఈ మూవీ పెద్దగా రాణించలేకపోయింది అనే చెప్పాలి. దానికి తోడు నెగిటివ్ టాక్ ఎఫెక్ట్ కూడా దెబ్బ కొట్టింది అని చెప్పొచ్చు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus