Bigg Boss 7 Telugu: శివాజీ ప్రిన్స్ ని అంత మాట అన్నాడా ? శోభాశెట్టి చేసిన మిస్టేక్ ఏంటంటే..!

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో వచ్చింది.రిజీల్ చేసింది బిగ్ బాస్ టీమ్. అయితే, టాస్క్ తర్వాత ప్రిన్స్ ఎమోషనల్ టచ్ ని ఈ ప్రోమోలో చూపించారు. ఇక్కడ శివాజీ అన్నమాటకి బాగా ఫీల్ అయ్యాడు ప్రిన్స్. “బేసిగ్గా నీకు ప్రశాంత్ అంటే ఇష్టం లేదు”. బయాస్డ్ గా ఉంది డెసీషన్ అనేసరికి ప్రిన్స్ యావార్ తట్టుకోలేకపోయాడు. టాస్క్ అయిపోయిన తర్వాత జరిగిన డిస్కషన్ లో భాగంగా ప్రిన్స్ చాలాసేపు బాధపడ్డాడు. ముఖ్యంగా శివాజీ అన్నమాటలు తీస్కోలేకపోయాడు. కేవలం శివాజీ మాత్రమే కాదు మిగతా హౌస్ మేట్స్ కూడా యావర్ ని బ్లేమ్ చేశారు. శోభాని సైడ్ చేశారు.

ఈవెన్ శివాజీ కూడ నీ తప్పేం లేదమ్మా అంటూ శోభకే సపోర్ట్ చేశాడు. దీనికి ప్రిన్స్ (Prince Yawar) ఇంకా బాధపడ్డాడు. నిజానికి టాస్క్ లో సంచాలక్ గా ఉన్న ప్రిన్స్ శోభా ఇద్దరూ కూడా బాధ్యత వహించాలి. టాస్క్ అయిన తర్వాత శోభాశెట్టి అరిచి గోల చేసింది. అందుకే శోభాశెట్టిని హౌస్ మేట్స్ ఎవ్వరూ కూడా ఒక్క మాట కూడా అనలేదు. ఇది కేవలం ఒక్కడి డెసీషన్ అంటూ శోభా చెప్పడమే ప్రిన్స్ కి వ్యతిరేఖంగా మారింది. దీనివల్ల శోభా సైడ్ అయిపోయింది. నిజానికి టాస్క్ లో ఇద్దరు సంచాలక్ లు అడ్డంగా ఫైయిల్ అయ్యారు. లాజిక్స్ పట్టుకోలేదు. ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా చెప్పలేకపోయారు.

ఒక పాయింట్ పైన పట్టుకుని కాన్ఫిడెంట్ గా డెసీషన్ చెప్పలేదు. మిగతా పార్టిసిపెంట్స్ అంతా గోల గోల చేస్తుంటే కన్ఫూజ్ అయిపోయారు. నిజానికి కంటెస్టంట్ గా ఆడటం – సంచాలక్ గా చూడటం ఈ రెండు బాధ్యతలు మోశారు ప్రిన్స్ ఇంకా శోభా ఇది అనుకున్నంత సులువైవ టాస్క్ కాదు. వాళ్లు ఆడుతూ మిగతా వారి మిస్టేక్స్ చూడాలంటే మాత్రం ఖచ్చితంగా జరగని పని. సంచాలక్ గా ఉండే గేమ్ కూడా ఆడిన యావర్ పైన, శోభాశెట్టి పై కంటెస్టెంట్స్ కి అస్సలు జాలే లేదు. ఏది హెల్ప్ చేయకపోగా రెచ్చిపోయి అరిచారు. రెండోసారి బెల్ కొట్టి ఓవర్ గా రియాక్ట్ అయిపోయాడు అమర్ ఇంకా సందీప్ ఇద్దరూ. దీంతో ఎటు తేల్చుకోలేని పరిస్థితికి వెళ్లిపోయారు సంచాలకులు.

అసలు సుబ్బు వాళ్లు గంట కొట్టలేదని కూడా అన్నారు హౌస్ మేట్స్ అందుకే ప్రిన్స్ అడిగాడు. అసలు గంట కొట్టారా లేదా అని అడిగేసరికి గొడవ అయ్యింది. నువ్వు జ్యూరీవి చూస్కోవాలి అన్నాడు శివాజీ. అలాగే మీ డెసీషన్ కి రెస్పెక్ట్ ఇస్తా కానీ మీరు డీల్ చేసిన విధానం తప్పు అంటూ కాసేపు ప్రిన్స్ పైన అరిచాడు శివాజీ. ఇక్కడే ప్రశాంత్ అంటే నీకు అస్సలు ఇష్టం లేదు అందుకే పక్షపాతం చూపించావ్ అనేసరికి ప్రిన్స్ కి బాగా బాధేసింది. ఇదే ప్రోమోలో చూపించింది. లైవ్ టెలికాస్ట్ లో ఇదంతా కూడా టెలికాస్ట్ చేశారు. నిజానికి సంచాలకులు కూడా తమ నిర్ణయాన్ని మార్చేశారు.

మూడుసార్లు విజేతలని మార్చుకుంటూ వెళ్లారు. దీంతో హౌస్ మేట్స్ కి ఛాన్స్ దొరికింది. డెసీషన్ చెప్పాల్సిన బాధ్యత వచ్చినపుడు లాజిక్స్ వర్కౌట్ చేయడంలో ఇద్దరూ విఫలం అయ్యారు. ఫస్ట్ నుంచీ కూడా ప్రిన్స్ డిస్కషన్ చేస్తున్నాడు. శోభా వినే స్టేజ్ లో లేదు. మద్యలోనే లేచి ప్రిన్స్ పై అరిచింది. దీనికి నేను డిస్కషన్ చేస్తున్నాను అని, వినిపించుకోకుండా అరుస్తావెందుకు అంటూ ప్రిన్స్ ఎదురుతిరిగాడు. అప్పుడు కూర్చుని మరోసారి డిస్కషన్ చేసుకుని పైనల్ గా రాంగ్ డెసీషన్ ఇచ్చారు. అందరూ మాట్లాడుతుంటే అసలే కన్ఫూజన్ మైండ్ అయిన శోబాశెట్టి చేతులు ఎత్తేసింది.

ప్రిన్స్ యావర్ పై నెట్టేసింది. దీంతో మనోడ్ని ఆడుకున్నారు అందరూ. అందరూ కలిసి చుట్టు ముట్టి మరీ మాటలు అన్నారు. దీంతో ప్రిన్స్ ఎమోషనల్ అయిపోయాడు. ఇక్కడే చాలాసేపటి తర్వాత అందరూ గొడవ అయిపోయాక తినడానికి వెళ్లారు. ప్రిన్స్ తో చాలాసేపు శివాజీ మాట్లాడాడు. కన్సోల్ చేశాడు. ఆ మాట అన్నందుకు సారీ కూడా చెప్పాడు. ప్రిన్స్ శాంతించాడు. ఒక డిష్ చేసినపుడు సరిగ్గా గార్నిషింగ్ కూడా ఉండాలి సార్ అంటూ ప్రిన్స్ కన్విన్స్ చేశాడు. శివాజీ కూడా నువ్వు అందరిదీ చూడలేకపోయావ్ లే అంటూ కొట్టిపారేశాడు.

సంచాలక్స్ ఇద్దరూ కూడా గట్టి నిర్ణయం తీస్కోలేకపోయారు. శోభా శెట్టి అయితే తను పౌల్ గేమ్ ఆడింది. మిగతా వాళ్లది పౌల్ గేమ్ అంటూ చెప్పింది. ఫస్ట్ ఆడింది తనే. అంత గజిబిజిలో కూడా లాస్ట్ వరకూ ప్రిన్స్ నెంబర్ కోసం ప్రయత్నిస్తునే ఉన్నాడు. అలాగే ఎప్పుడు ఎగ్రెసివ్ గా దూసుకుపోతూ నువ్వెంత అంటూ రంకెలు వేసే ప్రిన్స్, రెచ్చిపోయి ఓవర్ చేసే ప్రిన్స్ కోపాన్ని బాగా కంట్రోల్ చేశాడు. అరవకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు. అదీ మేటర్.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus