Bigg Boss 7 Telugu: వెక్కి వెక్కి ఏడ్చిన ప్రిన్స్ యావార్..! ఓదార్చిన శివాజీ..! గేమ్ లో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో బొమ్మల టాస్క్ లో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. మూడో వారాలు ఇమ్యూనిటీ కోసం పోటీ పడే కంటెండర్స్ ముగ్గురి మద్యలోనే ఫిట్టింగ్ పెట్టాడు. మీలో మీరు తేల్చుకుని వీక్ కంటెస్టెంట్ ఎవరో వారిని పోటీ నుంచీ తప్పించమని చెప్పాడు. దీంతో ప్రియాంక ఇంకా శోభాశెట్టి ఇద్దరూ కలిసి ప్రిన్స్ ని తప్పించారు. ఇక్కడే ప్రిన్స్ వాళ్లు చెప్పిన కారణాలకి బరెస్ట్ అయ్యాడు.

తను ఎగ్రెసివ్ బిహేవియర్ అని, హౌస్ మేట్ కి ఇలాంటివి ఉండటం కరెక్ట్ కాదని ప్రియాంక చెప్పింది. ఈ రీజన్ కి ప్రిన్స్ ని బాధపెట్టింది. దీంతో హ్యామర్ తో తన బొమ్మని గట్టిగా కొట్టుకుని వచ్చి బాధపడ్డాడు. సంచాలక్ సందీప్ ఓదార్చే ప్రయత్నం చేశాడు. అలాగే, తన బాధని వచ్చి శివాజీకి చెప్పుకున్నాడు. నేను ఇక్కడికి వచ్చేటపుడు నా దగ్గర అస్సలు డబ్బులు లేవని కనీసం 100 రూపాయలు కూడా లేవని ఏడ్చాడు.

బిగ్ బాస్ వాళ్లు ఇచ్చిన అడ్వాన్స్ తో కొన్ని బట్టలు కొనుక్కున్నాను అని, అందుకే వీకెండ్ బట్టలు పంపించడానికి కూడా నాకు ఎవరు లేరు. మా దగ్గర డబ్బులు కూడ లేవని చెప్పాడు. చాలా కష్టాలు పడుతున్నాను అని, అస్సలు ఎర్నింగ్స్ లేవని ఎంతోమంది దగ్గరకి వెళ్తున్నా వర్కౌట్ అవ్వడం లేదని శివాజీకి చెప్పి ఏడ్చాడు. చిన్నప్పటి నుంచీ కష్టపడుతున్నా కూడా ఇలా మాట్లాడుతున్నారని, మా మదర్ నుంచీ నాకు ఈ ఎగ్రెసివ్ నెస్ వచ్చింది నేను ఏం చేయాలి.

చిన్న చిన్న విషయాలకి కోపం రాదని, అస్తమానం ఇదే రీజన్ చెప్పి నన్ను గేమ్ నుంచీ తప్పించడం కరెక్ట్ కాదని చెప్పాడు. ఇక శివాజీ ప్రతి కుక్కకి ఒకరోజు వస్తుంది గుర్తుపెట్టుకో, అప్నా టైమ్ ఆయేగా అంటూ ధైర్యం చెప్పాడు. అంతేకాదు, నాకు తెలుసు ఈ కష్టాలు ఎలా ఉంటాయో నువ్వు ఏడుస్తూ బాధపడితే ఇంకా నిన్ను కిందకి లాగేస్తారు అంటూ మాట్లాడాడు. దీంతో కొంచెం ప్రిన్స్ కూల్ అయి నార్మల్ అయ్యాడు.

మరోవైపు ప్రియాంక ఇంకా శోభాశెట్టి ఇద్దరికీ యంత్రపు ఎద్దు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో ఎవరు గెలిస్తే వారికి మూడు వారాల ఇమ్యూనిటీ వస్తుంది. ఇది వీకండ్ నాగార్జున ఎనౌన్స్ చేస్తాడని చెప్పాడు బిగ్ బాస్. దీంతో హౌస్ మేట్స్ లో టెన్షన్ పెరిగిపోయింది. అయితే, ఆడియన్స్ మాత్రం బిగ్ బాస్ దత్తపుత్రిక ప్రియాంకకి వస్తుందనే కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు. అలాగే ఎవరు పర్మినెంట్ గా హౌస్ మేట్ (Bigg Boss 7 Telugu) అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus