టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి రూటే సపరేట్ అనే సంగతి తెలిసిందే. సినిమాల కోసం జక్కన్న ఎక్కువ మొత్తం ఖర్చు చేయడానికి అస్సలు వెనుకాడరు. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా జక్కన్న సినిమాపై అంచనాలను పెంచిన సంగతి తెలిసిందే. రాధేశ్యామ్, భీమ్లా నాయక్ మేకర్స్ తమ సినిమాలకు సెకండ్ ట్రైలర్ ను విడుదల చేసినా రాజమౌళి మాత్రం ఆర్ఆర్ఆర్ సెకండ్ ట్రైలర్ ను కూడా విడుదల చేయలేదు.
అయితే జక్కన్న విషయంలో ప్రింట్ మీడియా గుర్రుగా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రముఖ తెలుగు పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి జక్కన్న కానీ ఆర్ఆర్ఆర్ టీమ్ కానీ ఆసక్తి చూపడం లేదు. సాధారణంగా పెద్ద సినిమాలు రిలీజైన సమయంలో ప్రింట్ మీడియాకు యాడ్స్ వస్తాయి. అయితే ఆర్ఆర్ఆర్ విషయంలో అందుకు భిన్నంగా జరుగుతోందని సమాచారం అందుతోంది. బాహుబలి సినిమా సమయంలో కూడా యాడ్లు ఇవ్వకపోయినా జక్కన్న ఇంటర్వ్యూలు ఇచ్చారు.
ఆర్ఆర్ఆర్ విషయంలో మాత్రం రాజమౌళి ప్రింట్ మీడియా విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ పై ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడటంతో డబ్బులు ఖర్చు చేసి సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి రాజమౌళి ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. మరోవైపు ఆర్ఆర్ఆర్ టికెట్లను డిస్ట్రిబ్యూటర్లు బ్లాక్ లో అమ్మేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లో బ్లాక్ లో ఒక్కో టికెట్ ను 3,000 రూపాయలకు అమ్మేశారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం గురించి డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
ఆర్ఆర్ఆర్ టికెట్ రేట్లు మరీ ఎక్కువగా ఉండటంపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ రేట్ల పెంపు వల్ల ఈ సినిమాను థియేటర్లలో చూడాలని అనుకునే అనుకునే ప్రేక్షకులు ఎక్కువమొత్తం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రేక్షకుల అంచనాలను మించి విజయాన్ని అందుకుంటుందేమో చూడాల్సి ఉంది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ఫలితం వెల్లడి కానుంది.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!