Prithviraj Assets: పృథ్వీరాజ్ సుకుమారన్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Ad not loaded.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran)  ది గోట్ లైఫ్  (The Goat Life)  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా యావరేజ్ మూవీ అని క్రిటిక్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలో సలార్2 (Salaar)  సినిమాతో పృథ్వీరాజ్ సుకుమారన్ బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. సలార్2 సినిమాలో ఎన్నో ట్విస్టులు ఉండనున్నాయని ఈ సినిమా క్లైమాక్స్ ఊహలకు అందని విధంగా ఉండనుందని తెలుస్తోంది.

మరోవైపు పృథ్వీరాజ్ సుకుమారన్ ఆస్తుల విలువ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ నికర ఆస్తుల విలువ ఏకంగా 54 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. పృథ్వీరాజ్ టాలీవుడ్ స్టార్స్ సినిమాలకు డైరెక్టర్ గా వ్యవహరించాలని భావిస్తున్నారు. క్రేజ్ అంతకంతకూ పెంచుకుంటున్న పృథ్వీరాజ్ సుకుమారన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో భవిష్యతులో మరింత బిజీ కావడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పృథ్వీరాజ్ రెమ్యునరేషన్ కూడా ఒకింత భారీ రేంజ్ లో ఉంది.

అయితే రెమ్యునరేషన్ కంటే కథ, పాత్ర ముఖ్యమని మంచి కథలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తానని పృథ్వీరాజ్ సుకుమారన్ చెబుతుండటం గమనార్హం. పృథ్వీరాజ్ సుకుమారన్ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ తన సక్సెస్ రేట్ ను కూడా పెంచుకుంటున్నారు. సలార్2 సినిమాపై పృథ్వీరాజ్ సుకుమారన్ హైప్ భారీ రేంజ్ లో పెంచేస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు.

కథల ఎంపికలో పృథ్వీరాజ్ సుకుమారన్ కు ఎవరూ సాటిరారంటూ మరి కొందరు సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. సలార్2 సినిమాలో పృథ్వీరాజ్ రోల్ ప్రభాస్ కు ధీటుగా ఉంటుందని తెలుస్తోంది. ఇద్దరి మధ్య శత్రుత్వాన్ని బలంగా చూపించనున్నారని సమాచారం అందుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus