Salaar Movie: సలార్ విలన్ పాత్ర కోసం టాలీవుడ్ హీరోని తీసుకోవాలనుకున్నారా?

కేజిఎఫ్ సినిమాతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తన తదుపరి సినిమాని కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. కే జి ఎఫ్ ఈ చిత్రాన్ని నిర్మించినటువంటి హోమ్ భలేఫిలిం మేకర్ ప్రశాంత్ నీల్ తదుపరి సినిమాని కూడా నిర్మిస్తున్నారు. ఈయన డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

ఈ సినిమా (Salaar Movie) కూడా రెండు భాగాలుగా విడుదల కాబోతుందని వెల్లడించారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఇక ఇందులో జగపతిబాబు , ఆయన కుమారుడి పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. సలార్ సినిమాలో ముందుగా పృధ్విరాజ్ పాత్రలో నటించడం కోసం ఒక టాలీవుడ్ హీరోని తీసుకుంటే బాగుంటుందని ప్రభాస్ డైరెక్టర్ కి సూచించారట.

మరి ప్రభాస్ సూచించిన ఆ టాలీవుడ్ హీరో ఎవరు అనే విషయానికి వస్తే… ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో నటించడం కోసం ప్రభాస్ టాలీవుడ్ హీరో తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి గోపిచంద్ ను సూచించారట అయితే గోపీచంద్ ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారని ప్రశాంత్ నీల్ చెప్పారట.

ప్రభాస్ మాటలు విన్నటువంటి ప్రశాంత్ నీల్ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అలాంటి సమయంలో హీరో విలన్ ఇద్దరూ కూడా తెలుగు వాళ్ళు అయితే మనకు పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ పరంగా వర్కౌట్ కాదని ప్రశాంత్ చెప్పడంతో ఆయన అభిప్రాయానికి ప్రభాస్ కూడా అంగీకరించడంతో ఈ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ భాగమయ్యారని తెలుస్తోంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus