ఆ హీరోయిన్ తో కలిసి నటిస్తే చనిపోతున్నారట..!

‘లీడర్‌’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’, ‘180’ ‘కో అంటే కోటి’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది ప్రియా ఆనంద్. అయితే ఈ చిత్రాలేమీ ఆమెకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కోలీవుడ్, బాలీవుడ్ బాట పట్టింది. అయినా ఈమెకు సరైన గుర్తింపు రాలేదు. ఏదో అడపా దడపా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంది. ఇదిలా ఉండగా… ఈమెతో నటిస్తే చాలు చనిపోతారంటూ ఓ నెటిజెన్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టాడు. దీనికి ప్రియా ఆనంద్ కూడా ఘాటుగా స్పందించడంతో వెంటనే క్షమాపణలు చెప్పాడు.

వివరాల్లోకి వెళితే.. ‘’ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ చిత్రంలో శ్రీదేవితో కలిసి నటించింది ప్రియా ఆనంద్‌. ఆమె ఇటీవల చనిపోయింది. ఇక ‘ఎల్‌కేజీ’ చిత్రంలో కూడా ప్రియా ఆనంద్‌తో కలిసి నటించిన సహనటుడు జేకే రితీశ్‌ కూడా మృతి చెందాడు. దీంతో… ప్రియాఆనంద్ తో కలిసి నటిస్తే చాలు వాళ్ళు చనిపోతున్నారు..? ప్రియా ఆనంద్ దురదృష్టానికి మారు పేరు’ అంటూ ట్వీట్‌ చేశారు.ఈ ట్వీట్ చూసిన ప్రియ ఆనంద్ కు బాధ కలిగినట్టుంది. వెంటనే నెటిజన్‌కు సున్నితంగా బుద్ధి చెబుతూ సమాధానం ఇచ్చింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని రిప్లై ఇచ్చింది. ‘‘నీలాంటి వాళ్ళ మాటలకు సాధారణంగా నేను స్పందించను. కానీ నీ వ్యాఖ్యలు కఠినమైనవని నీకు తెలిపేందుకు రిప్లై ఇస్తున్నా. సోషల్‌మీడియాలో ఇలాంటి కామెంట్లు చూసి మౌనంగా ఉండిపోవడం సులభమే. కానీ నీ మాటల వల్ల ప్రజలు ఎంత బాధపడతారో ముందు తెలుసుకో. కాబట్టి ఇలాంటి ట్వీట్లు చేసే ముందు ఓ నిమిషం ఆలోచించి.. దయ, మానవత్వంతో వ్యవహరించు’” అంటూ స్పందించింది. దీనికి ఆ నెటిజన్ ‘నన్ను క్షమించండి. నా తప్పును ఒప్పుకుంటున్నా. ఇవాళ నేను ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’, ‘ఎల్‌కేజీ’ సినిమాలు చూశా. మీరే రెండింటిలో కామన్‌గా ఉన్నారు. అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. అందుకే ఇలా ట్వీట్‌ చేశా. మీరు ట్వీట్లు చదవరు అనుకున్నాను. నేను అలా మాట్లాడినా.. మీరు సున్నితంగానే సమాధానం ఇచ్చారు’ అంటూ వివరణ ఇచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus