సినిమా రంగంలో హీరోలు హీరోయిన్లు ఎప్పుడు ఎవరితో ? ప్రేమలో మునిగితేలుతూ ఉంటారు.. ఎప్పుడు ఎవరెవరు సహజీవనం చేస్తూ ఉంటారు.. ఎప్పుడు విడిపోతారు ? తిరిగి వాళ్లు ఎవరితో ప్రేమలో పడి ఎవరితో సహజీవనాలు చేస్తుంటారో అస్సలు అర్థం కాదు. ఇలాంటి సంఘటన బాలీవుడ్ లో జరిగింది. ఒకప్పుడు ఒక స్టార్ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ గా ఉన్న నటుడు.. ఇప్పుడు మరో నటీమణి ప్రేమలో మునిగి తేలుతున్నాడు. వారిద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో చూద్దాం.
కొన్నాళ్ళ క్రిందట విక్టరీ వెంకటేష్, రానా హీరోలుగా రానా నాయుడు వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. ఇందులో రానాను టెంప్ట్ చేసే పాత్రలో నటించిన ఓ అమ్మాయి బాగా హైలైట్ అయింది. ఆమెను తెలుగు ప్రేక్షకులు 10 ఏళ్ల ముందే చూసారు. కిస్, జోరు, అసుర తదితర సినిమాలు చేసిన ప్రియా బెనర్జీకి ఆ సినిమాలు పెద్దగా కలిసి రాక బాలీవుడ్‌కు చెక్కేసింది. మళ్లీ చాలా రోజుల తర్వాత ఆమెకు వెంకటేష్, రానా కలిసి నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్‌లో నటించే ఛాన్స్ వచ్చింది.
ప్రస్తుతం ఓటీటీలో బిజీగా ఉన్న ఈ భామ (Priya Banerjee) ఓ యంగ్ హీరోతో తన ప్రేమను కన్ఫర్మ్ చేసింది. ఆ హీరో ఎవరో ? కాదు ప్రతిక్. ప్రతీక్ తాను ప్రతి మూడేళ్లుగా కలిసి ఉంటున్నాం.. మా బంధం పై పెద్దగా చర్చలు ఉండకూడదని బయటకు చెప్పలేదని.. ఇక ఇప్పుడు దీనిపై అనవసర ప్రచారం వద్దని.. తాను తమ ప్రేమ గురించి చెబుతున్నానని.. త్వరలోనే పెళ్లి కూడా ఉంటుంది.. ఎప్పుడనేది టైం చూసుకుని ప్రకటిస్తామంటూ చెప్పింది.
ప్రస్తుతానికి తాము ఇద్దరం ప్రేమలో చాలా సీరియస్ గా ఉన్నాం అని కూడా చెప్పింది. ఇంతకు ప్రియ ప్రేమికుడు ఎవరో ? కాదు బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. మన తెలుగు ప్రజలకు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న హీరోయిన్ అమీ జాక్సన్. ప్రతీక్ ఆమెతో కూడా గతంలో డేటింగ్ చేశాడు. ఆ తర్వాత 2019లో సన్యాసాగర్ అనే నిర్మాతని పెళ్లి చేసుకుని ఏడాదికే ఆమె విడాకులు ఇచ్చేసాడు. ఇప్పుడు తిరిగి ప్రియాతో ప్రేమలో పడ్డాడు.
ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?