ఆమె జీవితం ఇలా మారడానికి ఆ రాత్రే కారణం అంటున్న వింక్ బ్యూటీ!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకోవాలంటే అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలనే సంగతి తెలిసిందే. అయితే అన్నీ ఉన్నా ప్రియా వారియర్ కు మాత్రం స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కడం లేదు. తెలుగులో ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన చెక్ సినిమా నేడు విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే సినిమాలో ప్రియ పాత్ర కొంతసేపు మాత్రమే ఉండటం గమనార్హం. చెక్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ కీలక విషయాలను వెల్లడించిన వింక్ బ్యూటీ ప్రియా వారియర్ రాత్రికి రాత్రే స్టార్ డమ్ రావడం గురించి మాట్లాడుతూ అసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టాలీవుడ్ నుంచి తనకు ఛాన్సులు వస్తున్నా మంచి స్టోరీ కోసం ఎదురు చూశానని చంద్రశేఖర్ ఏలేటి చెప్పిన కథ తనకు ఎంతగానో నచ్చిందని ప్రియా వారియర్ అన్నారు. తెలుగులో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టడానికి చెక్ సరైన సినిమా అనిపించిందని ఆమె అన్నారు. చెక్ మూవీలో సాహసాలకు వెనుకాడని యాత్ర పాత్రలో తాను నటించానని నిజ జీవితంలో కూడా తాను అలానే ఉంటాను కాబట్టి ఆ పాత్ర కోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం రాలేదని ఆమె అన్నారు. తెలుగులో తాను కొంతవరకు మాట్లాడతానని ప్రియా వారియర్ తెలిపారు. చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అంటే చాలా ఆసక్తి అని..

ఆ ఆసక్తి వల్లే అద్దం ముందు నిల్చొని డైలాగులు కూడా ప్రాక్టీస్ చేసేదానినని ఆమె అన్నారు. ఇంటర్ చదివే సమయంలో అడిషన్స్ లో పాల్గొని మొదట్లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో, ఆ తరువాత ఒరు ఆదార్ లవ్ (లవర్స్ డే) సినిమాలో నటించానని ఆమె తెలిపారు. ఆ సినిమాలో కన్ని గీటే సన్నివేశం సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో తన జీవితంలో ఊహించని మార్పులు వచ్చాయని ప్రియా వారియర్ వెల్లడించారు.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus