Priyadarshini Ram: ప్రేమ కోసం పేకాట నేర్చుకున్నా: ప్రియదర్శిని రామ్

సినిమా ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రియదర్శిని రామ్ మీడియా రంగంలో కూడా ఎంతో కీలక బాధ్యతలు వ్యవహరించారు. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని కారణాల వల్ల ఈయన ఇటు మీడియాకు అటు సినిమా ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ప్రియదర్శిని రామ్ తన లవ్ స్టోరీ రిలీజ్ చేశారు. ఈయనది లవ్ మ్యారేజ్ అని తెలియజేస్తూ తన లవ్ స్టోరీని బయటపెట్టారు.

రామ్ (Priyadarshini Ram) లవ్ స్టోరీ కనుక వింటే ఓ సినిమాని తలపిస్తుందని చెప్పాలి.తాను 24 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 18 సంవత్సరాల వయసున్న అమ్మాయిని ఇష్టపడ్డానని తెలిపారు.. ఆ అమ్మాయిని ఇష్టపడి తనకు నా ప్రేమ విషయాన్ని చెప్పడంతో తాను తిరస్కరించింది.ఇక నా పరిస్థితి ఇది మా అమ్మ నాన్న పరిస్థితి అంటూ తనకు అన్ని వివరించడంతో ఒక వీక్ మూమెంట్లో తన ప్రేమకు ఒప్పుకుందని రామ్ తెలిపారు. ఇప్పుడైతే అసలు ఒప్పుకునేది కాదు అంటూ ఈయన తెలియచేశారు.

ఇలా ఆ అమ్మాయి కూడా తనను ఇష్టపడటంతో మా పెళ్లి గురించి ఇంట్లో చెప్పాలి అని భావించాము అయితే తన తండ్రి ఒక ఫారెస్ట్ ఆఫీసర్. తనని మంచిగా పరిచయం చేసుకుని తనకు తమ ప్రేమ విషయాన్ని చెప్పాలని భావించాను. అయితే అప్పటివరకు నాకు మందు తాగడం గాని పేకాట ఆడటం కానీ రాదు.అమ్మాయి తండ్రి మాత్రం విపరీతంగా పేకాట ఆడేవారు. వారి వీధిలో ఒక ఐదుగురిని వెంట వేసుకొని తరచూ పేకాట ఆడుతూ ఉండేవారు.

తనని ఇంప్రెస్ చేయాలి అంటే తాను కూడా పేకాట నేర్చుకోవాలని భావించి తన వద్దకు వెళ్లి రోజు పేకాట నేర్చుకునే వాడిని అంతేకాకుండా పేకాట ఆడే సమయంలో అమ్మాయి తండ్రి వద్ద మంచి మార్కులు కొట్టేయడం కోసం తాను ఓడిపోయి తనని గెలిపించే వాడినని రామ్ తెలిపారు. ఇక అంతా సెట్ అయింది అని తన ప్రేమ విషయాన్ని ఆ అమ్మాయి తండ్రికి చెప్పడంతో ఒకసారిగా తనని దూరం పెట్టారని తెలిపారు. మా ప్రేమ విషయం తెలిసిన తర్వాత ప్రతిరోజు అమ్మాయిని తన తండ్రి స్వయంగా కాలేజీకి తీసుకెళ్లి తీసుకొచ్చేవారని తెలిపారు.

ఒకరోజు అమ్మాయి కాలేజ్ కి వెళ్ళిన తర్వాత అటు నుంచి అటే తీసుకెళ్లిపోయానని రామ్ తెలిపారు. అయితే ఈ విషయం ముందుగా రాజశేఖరరెడ్డి అన్నకు చెప్పానని ఆయనకు ఈ విషయం చెప్పగానే ఆయన రిజిస్టర్ ఆఫీస్ కి ఇన్ ఫాం చేసి మా పెళ్లికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా సిద్ధం చేయించి పెట్టారని రామ్ తెలిపారు.తన కూతురిని పెళ్లి చేసుకున్నాననే విషయం తెలియడంతో రాజశేఖరరెడ్డి అన్న ముందే నా కాలర్ పట్టుకున్నారని అయితే రాజశేఖర్ రెడ్డి అన్న నా గురించి చెప్పడంతో ఆ అమ్మాయి తండ్రి సైలెంట్ అయ్యారు అంటూ ఈ సందర్భంగా తన ప్రేమ గురించి రామ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus