Priyamani: అట్లీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రియమణి.. ఏం చెప్పారంటే?

  • September 14, 2023 / 10:54 AM IST

షారుఖ్ ఖాన్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కిన జవాన్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి కలెక్షన్లతో ప్రదర్శితమవుతోంది. వీక్ డేస్ లో కూడా ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది. జవాన్ మూవీ ఫుల్ రన్ లో భారీ స్థాయిలో లాభాలను అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జవాన్ మూవీలో ప్రియమణి కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రియమణి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒక విషయంలో అట్లీ నన్ను మోసం చేశాడని ఆమె అన్నారు. జవాన్ సినిమాలో ఛాన్స్ అంటే మొదట క్యామియో రోల్ అనుకున్నానని ఆ తర్వాత ఆ రోల్ ముఖ్యమైన రోల్ అని తెలిసి సంతోషించానని ప్రియమణి కామెంట్లు చేశారు. జవాన్ మూవీకి అట్లీ డైరెక్టర్ అని తెలిసిన వెంటనే ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని ప్రియమణి పేర్కొన్నారు. ఆర్య అట్లీ తన ఫ్రెండ్ అని జూమ్ కాల్ లో పరిచయం చేశాడని ప్రియమణి (Priyamani) అన్నారు.

జవాన్ మూవీ తమిళ్ వెర్షన్ లో విజయ్, జవాన్ మూవీ తెలుగు వెర్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ రోల్ లో నటిస్తారని ప్రచారం జరిగిందని ప్రియమణి కామెంట్లు చేశారు. విజయ్ జవాన్ సినిమాలో నటిస్తున్నారా అని అడిగితే నటింపజేస్తానని అట్లీ చెప్పడంతో సంతోషించానని ప్రియమణి అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయ్ తో ఒక్క సీన్ లో అయినా నన్ను నటింపజేయాలని అట్లీని కోరానని ప్రియమణి వెల్లడించారు.

దర్శకుడు అట్లీ కూడా సరేనని చెప్పి చివరకు మోసం చేశారని ఆమె తెలిపారు. అట్లీ చివరి వరకు నేను ఏమార్చుతూ వచ్చానని ప్రియమణి అన్నారు. అయితే ఈ సినిమాలో విజయ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ నటించలేదని ప్రియమణి కామెంట్లు చేశారు. ప్రియమణి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జవాన్ సినిమాలో విజయ్, ఎన్టీఆర్ నటించి ఉంటే ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus