Priyamani: ది ఫ్యామిలీ మెన్ సీజన్ 3 కి సర్వం సిద్ధం!

బాలీవుడ్ దర్శకులు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఇప్పటికే రెండు సీజన్లు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకోగా మూడవ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రియమణి మనోజ్ బాజ పాయ్ జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సిరీస్ భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకుంది. ఇక ఈ సిరీస్ రెండవ సీజన్ లో సమంత కూడా నటించిన సంగతి తెలిసిందే.

ఈ సిరీస్ ద్వారా సమంతకి కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. అయితే సిరీస్ సీజన్ 3 ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి సమయంలో ప్రియమణి ఈ సిరీస్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాజాగా ఈమె బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రియమణి వరుస బాలీవుడ్ ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు ఇది ఫ్యామిలీ మెన్ సీజన్ 3 గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈ సందర్భంగా ప్రియమణి (Priyamani) మాట్లాడుతూ ది ఫ్యామిలీ మెన్ సీజన్ 3 సిరీస్ త్వరలోనే మీ ముందుకు రాబోతుంది. రాజ్ అండ్ డీకే సర్ నాకు కాల్ చేసి ఈ విషయాన్ని తెలియజేశారు. మీరందరూ కూడా సీజన్ 3 కోసం వెయిట్ చేయండి అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus