Priyamani: ఆ హీరోతో రోమాన్స్ చేయాలి.. మనస్సు లో మాట బయట పెట్టిన ప్రియమణి!

  • May 10, 2023 / 06:20 PM IST

యమదొంగ సినిమాలో అందంతో కూడిన అమాయకత్వం కనిపించిన హీరోయిన్ ప్రియమణి రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉంటుంది. ప్రియమణి నటన, అభినయం, డ్యాన్స్, అందం ఇలా హీరోయిన్ కి కావలసిన అన్ని కళలు ఉన్న నటి ప్రియమణి. వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళింది ప్రియమణి. టాలీవుడ్ లో ప్రియమణి ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. అందాలు ఆరబోసేందుకు కూడా వెనుకాడలేదు.

కెరీర్, పర్సనల్ లైఫ్ విషయంలో ప్రియమణి (Priyamani) ప్లానింగ్ తో వ్యవహరించింది. చకచకా సినిమాలు చేసేసింది. విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో తెలివిగా వివాహం చేసేసుకుంది. తాజాగా నాగ చైతన్య సినిమాలో కీలకపాత్రలో నటించింది. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ‘కస్టడీ’. ఇందులో ప్రియమణి ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె తన మనసులోని ఓ చిలిపి కోరికను తెలిపింది.

స్టార్ హీరో చిరంజీవితో రోమాన్స్ చేయాలనుందని సిగ్గులు ఒలకపోస్తూ చెప్పింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. మెగా మూవీ ఆఫర్ కోసం బానే హోయలుపోతున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆ ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ.. చైతన్య నాకు చాలా సంవత్సరాల క్రితమే పరిచయం. మొదటిసారి తనతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నా. మా కాంబినేషన్‌ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇక తెలుగులో ఉన్న అగ్ర హీరోలందరితో నేను వర్క్‌ చేశాను. బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున అందరి సినిమాల్లోనూ నటించాను. కానీ చిరంజీవి గారితో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఆయనతో కలిసి నటించాలని ఉంది అంటూ తన మనసులో కోరికను బయట పెట్టింది. అలాగే తనకు షారుక్‌ ఖాన్‌ అంటే ఇష్టమని తెలిపింది. తనతో కలిసి ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటిస్తానని చెప్పింది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus