Bhamakalapam 2: ‘పొలిమేర 2’ ఇచ్చిన ధైర్యం… మరో సినిమా థియేటర్లలోకి.!

కరోనా – లాక్‌డౌన్‌ సమయంలో చాలా సినిమాలు థియేటర్లలో కాదని… ఓటీటీలో డైరెక్ట్‌గా వచ్చాయి. అలా వచ్చినవాటిలో కొన్ని అనుకోని విజయాలు సాధించాయి. కాన్సెప్ట్‌ ఆధారంగా రూపొందిన ఆ సినిమాలకు మంచి పేరు వచ్చింది, స్ట్రీమింగ్‌ మినిట్స్‌ కూడా వచ్చాయి. వాటికి సీక్వెల్స్‌కు టీమ్‌లు సిద్ధమయ్యాయి. అయితే ఆ సినిమాలను తొలి సినిమాలో ఓటీటీలో కాకుండా… నేరుగా థియేటర్లకు తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇలా ఓ సినిమా వచ్చి భారీ విజయం సాధించగా.. ఇప్పుడు మరో సినిమా సిద్ధమవుతోంది.

సీనియర్ నటి ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలు చేస్తోంది. అలాగే వీలైనప్పుడు నాయికా ప్రాధాన్యమున్న చిత్రాలవైపు ఆసక్తి చూపిస్తోంది. ఈ క్రమంలో ఓటీటీలో ‘భామాకలాపం’ అంటూ వచ్చి మంచి విజయం అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ విషయాన్ని సినిమా మేకర్స్ ఇటీవల అధికారికంగా వెల్లడించారు. ‘భామాకలాపం 2’ (Bhamakalapam 2) ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. తొలి సినిమాలాగే ఇందులోనూ డిఫరెంట్గానే ట్రై చేస్తున్నారు.

ఓ చేతిలో వాక్యూమ్ క్లీనర్ పట్టుకుని ప్రియమణి స్టైలిష్ లుక్‌లో కనిపిస్తోంది. అయితే ఆమె పక్కన రక్తం మరకలతో కూడిన ట్రాలీ బ్యాగ్ ఉంది. అలాగే ప్రియమణి చుట్టూ గన్స్ ఫైర్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మొత్తం సెటప్‌ వెనుక పెద్ద బిల్డింగ్ ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ‘ది మోస్ట్ డేంజరస్ ఉమన్’ థియేటర్లలోకి రాబోతోంది అంటూ సినిమా నిర్మాణ సంస్థ సోషల్‌ మీడియా పోస్టులో పేర్కొంది. ఈ లెక్కన ఓటీటీ ఆహా సినిమా నిర్మాణంలోకి కూడా వచ్చినట్లే. ఎందుకంటే ఈ సినిమాకు ఆహా సమర్పణ.

అభిమన్యు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్.విహారి సంగీత దర్శకుడు. తొలి పార్టులో పక్క ఇంటి విషయాల్లో ఆసక్తిని చూపే అనుపమ అనే మధ్యతరగతి గృహిణి పాత్రలో ప్రియమణి కనిపించింది. అలా ఓ రోజు అనుపమ ఓ మర్డర్ కేసులో చిక్కుకుంటుంది. ఆ నేరం నుంచి బయట పడేందుకు ఏం చేసింది అనే అంశాల నేపథ్యంలో ‘భామా కలాపం’ రూపొందింది. మరిప్పుడు ‘భామాకలాపం 2’లో అనుపమ ఇంకేం చేస్తుందో చూడాలి. ఇక ‘భామాకలాపం’ ఎందుకు థియేటర్లలో వస్తోంది అంటే.. ‘పొలిమేర 2’ అందించిన ఉత్సాహం అని చెప్పొచ్చు. ‘పొలిమేర 1’ ఓటీటీలో వచ్చి విజయం సాధించిన విషయం తెలిసిందే.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus