Priyanka Chopra: వాళ్లు నన్ను ఏడ్పించే వాళ్లు : ప్రియాంక చోప్రా

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ స్థాయిలో సత్తా చాటుతోంది. హిందీ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ అక్కడ అగ్ర హీరోలందరితో ఆడిపాడింది. క్రిష్, తుఫాన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక హాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన ఈ భామ తాజాగా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ అమ్మడు తాను హైస్కూల్‌ విద్య కోసం అమెరికాకు వెళ్లిన కొత్తలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పింది. క్యాంటీన్‌కు వెళ్లి ఫుడ్ ఎలా తీసుకోవాలో అప్పట్లో నాకు తెలియదు. వెండింగ్‌ మిషన్‌ నుంచి స్నాక్స్‌ తీసుకుని.. ఎవరూ చూడకుండా బాత్‌రూమ్‌లోకి వెళ్లి తినేసి.. క్లాస్‌రూమ్‌లోకి వెళ్లిపోయేదాన్ని. అలా, చాలా రోజులపాటు వేరే వాళ్లతో కలిసి తిరగలేదు. నాకున్న భయంతోనే నేను అలా ప్రవర్తించాల్సి వచ్చింది. సుమారు నాలుగు వారాలు అక్కడ ప్రతి విషయాన్ని గమనించాను.

ఆ తర్వాత నాలో ధైర్యం పెరిగింది. స్కూల్‌లో ఉన్న ఇతర పిల్లలతో ఫ్రెండ్‌షిప్‌ కోసం నేను ఎంతో మారాను. ఫ్రెండ్స్‌తో డేట్‌కు వెళ్లడం, లేట్‌ నైట్‌ పార్టీలు.. ఇలాంటివి మా కుటుంబంలో అనుమతించరని నా ఫ్రెండ్స్‌కు అర్థమయ్యేలా చెప్పాను. మొదటిలో అక్కడి విద్యార్థులు కొందరు ఏడిపించారు’’ అని ప్రియాంక తెలిపింది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ సైతం అందుకుంది గ్లామరస్ బ్యూటి ప్రియాంక చోప్రా. హిందీలోనే కాకుండా తెలుగు సినిమాల్లో కూడా నటించింది ఈ సుందరి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి జంజీర్ తెలుగులో తుఫాన్ సినిమాలో (Priyanka Chopra) నటించింది.

అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీని తర్వాత తెలుగులో ప్రియాంకకు అవకాశాలు రాలేదు. ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా 2002లో తమిజాన్ అనే తమిళ చిత్రంతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. అనంతరం 2004లో ఐత్రాజ్ అనే బాలీవుడ్ మూవీతో డెబ్యూ చేసింది. ఈ సినిమాలో మంచి నటన కనబర్చిన ముద్దుగుమ్మకు ప్రశంసలు దక్కాయి. తర్వాత క్రిష్, డాన్, ఫ్యాషన్ వంటి సినిమాలతో హిందీలో తెగ పాపులర్ అయింది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus