షూటింగ్ స్టార్ట్ అయ్యేవరకూ సినిమా చేస్తున్నట్లు ఇంట్లో చెప్పలేదు

సాధారణంగా హీరోయిన్లకు రెమ్యూనరేషన్ సరిగా వస్తుందో లేదో.. లేక ప్రమోషన్స్ లో తనను సరిగా ఎలివేట్ చేస్తారో లేదో అని టెన్షన్ పడుతుంటారు. కానీ.. అనంతపూర్ అమ్మాయి ప్రియాంక జవాల్కర్ మాత్రం ఆమెను ఎక్కడ సినిమాలో నుంచి తీసేస్తారేమోనని భయపడిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమే మీడియాతో పంచుకోవడం విశేషం. షార్ట్ ఫిలిమ్స్ లో పాపులారిటీ సంపాదించుకొన్న తర్వాత ప్రియాంక జవాల్కర్ కి హార్వర్డ్ లో సీట్ వచ్చింది. అక్కడ రెండేళ్ల పాటు చదువుకొన్న తర్వాత సినిమాల మీద అభిమానంతో చదువు మధ్యలోనే వదిలేసి హైద్రాబాద్ వచ్చేసింది.

కొన్ని ఆడిషన్స్ అనంతరం “టాక్సీవాలా” సినిమాలో సెలక్ట్ అయ్యాక సినిమాలో అవకాశం వచ్చినట్లు ఇంట్లో చెప్పలేదంట. అందుకు కారణం ఏంట్రా అంటే.. “సినిమాలో నుంచి సడన్ గా మధ్యలో తీసేస్తే పరిస్థితి ఏంట్రా?” అని ఆలోచించి ఆ నిర్ణయం తీసుకొందట. అయితే.. లక్కీగా ఎలాంటి ఇష్యూస్ లేకుండా సినిమా జరుగుతుండడంతో సగం షూటింగ్ అయ్యాక తన తల్లికి చెప్పిందట. మహారాష్ట్ర నుంచి వచ్చి అనంతపూర్ లో సెటిల్ అయిన ప్రియాంక జవాల్కర్ చేతిలో ప్రస్తుతం ప్రొజెక్ట్స్ ఏమీ లేకపోయినప్పటికీ.. ఎంక్వైరీస్ మాత్రం గట్టిగానే ఉన్నాయి. సొ, సినిమా రిజల్ట్ ఆమె కెరీర్ ను శాశిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus