ట్యాక్సీవాలా భామకు బంపర్ ఆఫర్ దక్కినట్లేనా ?

అసలు విడుదలవ్వదు అనుకొన్న “ట్యాక్సీవాలా”తోనే సూపర్ హిట్ అందుకొని తన కెరీర్ కి తొలి చిత్రంతోనే సూపర్ హిట్ ను దక్కించుకొన్న హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. అయితే.. ఆ సినిమా సూపర్ సక్సెస్ ఆమె కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. ఆ సినిమా విడుదలై ఆల్రెడీ నాలుగు నెలలవుతుంది. ఆ సినిమాను టీవీలో కూడా వేసేశారు. కానీ ఇప్పటివరకు మరో సినిమా సైన్ చేయలేదు. దాంతో అమ్మడి కెరీర్ ఇప్పుడప్పుడే ఊపందుకోవడం కష్టమని జనాలు కూడా ఫిక్స్ అయిపోయారు.

కానీ.. నిన్నట్నుంచి ఆమె అఖిల్ కొత్త సినిమా సైన్ చేసిందని. గీతా ఆర్ట్స్ నిర్మించనున్న తాజా చిత్రంలో కథానాయికగా ప్రియాంక జవాల్కర్ ఫైనల్ ఫిక్స్ అని వార్తలొచ్చాయి. దాంతో ఆమె సన్నిహితులందరూ ఆమెకు విషెస్ చెప్పడం మొదలెట్టారట. కానీ.. నిజానికి ఆమెను ఆ సినిమా కోసం సంప్రదించినవాళ్ళెవరూ లేరు. ప్రస్తుతం అమ్మడు తమిళంలో రెండు సినిమాలు సైన్ చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఒకవేళ అఖిల్ సినిమా ఆఫర్ వస్తే సూపర్ హ్యాపీ అంటోంది ప్రియాంక జవాల్కర్. మరి ఈ గాసిప్పు నిజమైతే బాగుండు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus