Priyanka Mohan: ఎస్.జె.సూర్యకి ప్రియాంక మోహన్ క్యూట్ రిక్వెస్ట్.!
- August 25, 2024 / 09:11 PM ISTByFilmy Focus
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్లో మాత్రమే కాదు, తెలుగు సినిమా చరిత్రలోనూ స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ సెన్సిబుల్ & బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ “ఖుషీ” (Kushi) . ఎస్.జె.సూర్య (SJ Surya) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. ఈ సినిమా తర్వాత ఎస్.జె.సూర్య-పవన్ కాంబినేషన్ లో వచ్చిన “పులి” (Puli) దారుణంగా విఫలమైంది. అయితే.. నిన్న “సరిపోదా శనివారం” (Saripodhaa Sanivaaram) ప్రీరిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) ఎస్.జె.సూర్యను ఉద్దేశించి మాట్లాడుతూ “సార్ ఖుషీ 2 సీక్వెల్ పవన్ కళ్యాణ్ తో తీయండి ప్లీజ్” అంటూ రిక్వెస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో భీభత్సంగా వైరల్ అవుతోంది.
Priyanka Mohan

ప్రియాంక మోహన్ ప్రస్తుతం తెలుగులో చేస్తున్న సినిమాల్లో పవన్ కళ్యాణ్ సరసన “ఓజీ” (OG) ఒకటి. సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో దానయ్య (D. V. V. Danayya) నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో ప్రియాంక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే.. ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలి అంటే “ఖుషీ 2” అనే కథ అటు పవన్ కళ్యాణ్ కి ప్రస్తుతానికి ఉన్న పొలిటికల్ ఇమేజ్ & ఏజ్ కి ఏమాత్రం సరితూగదు.

అలాగే.. ఎస్.జె.సూర్య నటుడిగా తనకు వస్తున్న కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్ ను వదులుకొని డైరెక్షన్ చేయడానికి కూడా ముందుకు రాడు. సో, సోషల్ మీడియాలో ఊహించుకోవడానికి సరదాగా ఉండే ఈ “ఖుషీ 2” వార్త నిజజీవితంలో వర్కవటవ్వడం అనేది కష్టం. కాకపోతే.. కొణిదెల అఖీరా నందన్ గనుక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అతడితో ఈ సీక్వెల్ ను ప్లాన్ చేయగలిగితే గనుక ఇండస్ట్రీ షేక్ అవ్వడం ఖాయం.

మరి అఖీరాకు ఆ ఇంట్రెస్ట్ ఉందో లేదో చూడాలి. ఇకపోతే.. మొన్న నాని “ఓజీ” అప్డేట్ అడగడం, ఇప్పుడు ప్రియాంక “ఖుషీ 2” చేయమని రిక్వెస్ట్ చేయడం వంటివన్నీ “సరిపోదా శనివారం” సినిమాకు మాత్రం మంచి మైలేజ్ ఇస్తున్నాయి. బుకింగ్స్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.












