Jailer Movie: ఆ కారణం వల్లే జైలర్ మూవీని ప్రియాంక వదులుకున్నారా?

రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జైలర్ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో రజనీకాంత్ నటించిన సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అయితే జైలర్ సినిమాతో రజనీకాంత్ ఖాతాలో సక్సెస్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తుండగా ఒక పాత్రకు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నారని కొన్ని నెలల క్రితం ప్రకటన వెలువడింది. అయితే ప్రియాంక అరుళ్ మోహన్ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ప్రియాంకకు మనస్పర్ధలు వచ్చాయని ఈ కారణం వల్లే ప్రియాంక సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ప్రియాంక స్థానంలో తమన్నా ఈ సినిమాలో నటించే అవకాశం ఉందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రియాంకకు దర్శకుడు నెల్సన్ కు వరుణ్ డాక్టర్ సినిమా సమయంలోనే మనస్పర్ధలు వచ్చాయని ఆ మనస్పర్ధలు మరింత పెరగడంతో జైలర్ సినిమాలో నటించలేనని ఆమె తేల్చి చెప్పారని సమాచారం అందుతోంది.

వైరల్ అవుతున్న వార్తలపై ప్రియాంక అరుళ్ మోహన్ స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది. దర్శకుడు నెల్సన్ గత సినిమా బీస్ట్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. నెల్సన్ కూడా తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ ను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు. కెరీర్ విషయంలో నెల్సన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

జైలర్ సినిమాకు సంబంధించి వైరల్ అవుతున్న వార్తలు రజనీకాంత్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్నాయి. రజనీకాంత్ ఈ సినిమాకు 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే రజనీకాంత్ రెమ్యునరేషన్ పెరిగే ఛాన్స్ ఉంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus