Priyanka Singh: టవల్ కట్టుకుని ప్రియాంక సింగ్ గ్లామర్ షో.. ఫోటోలు వైరల్!

‘జబర్దస్త్’ లో లేడీ గెటప్ లతో పాపులర్ అయిన సాయి తేజ.. ఆ తర్వాత జెండర్ మార్చుకుని ప్రియాంక సింగ్ గా మారిన సంగతి తెలిసిందే. తర్వాత బిగ్ బాస్ 5 లో ఎంట్రీ ఇచ్చి పింకీగా బాగా పాపులర్ అయ్యింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు మానస్ అనే మరో కంటెస్టెంట్ తో సన్నిహితంగా ఉండడం, ప్రేమ,రొమాన్స్, పెళ్లి అంటూ ఏవేవో మాటలు మాట్లాడటంతో ఈమె నిత్యం వార్తల్లో నిలిచేది.

‘మానస్ హజ్బెండ్ మెటీరియల్’ అంటూ హౌస్ లో ఈమె అనడంతో మానస్ తల్లి కూడా హర్ట్ అయ్యి ఆమె పై మండిపడింది. అయినప్పటికీ ప్రియాంక సింగ్ .. ట్రాన్స్ జెండర్ కాబట్టి.. ఆమె పై సింపతీ ఏర్పడింది. సమాజం వారిని కూడా ప్రోత్సహించాలి అంటూ ఆమెను ప్రతి నామినేషన్ లో సేఫ్ చేసేవారు నెటిజన్లు. అందుకే ఆమె 13 వారాల పాటు హౌస్ లో ఉండి టాప్ 7 లో నిలిచింది. హౌస్ లో నుండి బయటకు వచ్చాక..

ఈమె (Priyanka Singh) సినిమాల్లో బిజీ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. అవకాశాల కోసం గ్లామర్ ఫోటో షూట్లో పాల్గొని ఆ ఫోటోలను నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోల పై నెగిటివ్ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. అయినా ఈమె తగ్గడం లేదు. తాజాగా ఈమె టవల్ కట్టుకుని చేసిన ఫోటో షూట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. వీటి పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus