టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ ప్రొడ్యూసర్లలో అల్లు అరవింద్ (Allu Aravind) ఒకరు కాగా ప్రస్తుతం ఈ నిర్మాత అత్యంత భారీ బడ్జెట్ తో తండేల్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. తాజాగా అల్లు అరవింద్ బీ.ఎమ్.డబ్ల్యూ ఐ7 బ్రాండ్ కారును కొనుగోలు చేశారు. అత్యాధునిక టెక్నాలజీతో కొనుగోలు చేసిన ఈ కారులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు ధర ఏకంగా 2.5 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. ఈ కారు ఖరీదు తెలిసి షాకవ్వడం నెటిజన్ల వంతవుతోంది.
బన్నీ (Allu Arjun) బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ లో కూడా అల్లు అరవింద్ ఒక సినిమాను ప్లాన్ చేయగా ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాల్సి ఉంది. బాలయ్య (Nandamuri Balakrishna) బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా పూర్తైన తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అల్లు అరవింద్ నిర్మాతగా పాన్ ఇండియా హిట్లను సాధించాలని భావిస్తున్నారు. బన్నీ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో గీతా ఆర్ట్స్ భాగస్వామ్యం ఉండనుందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది.
అల్లు అర్జున్ కెరీర్ ప్లానింగ్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయి. వరుసగా సినిమాలలో నటిస్తున్న బన్నీ ప్రతి సినిమాకు కనీసం రెండేళ్ల సమయం కేటాయిస్తున్నారు. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తుండటంతో బన్నీకి కెరీర్ పరంగా కలిసొస్తోంది. అల్లు అర్జున్ తో సినిమాలు చేయాలని చాలామంది దర్శకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అల్లు అర్జున్ రెమ్యునరేషన్ పరంగా కూడా టాప్ లో ఉన్నారు. పుష్ప ది రూల్ (Pushpa2) కోసం బన్నీ 150 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది. పుష్ప2 డిజిటల్ రైట్స్ ఏకంగా 275 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. పుష్ప2 సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.