గ్రాండ్‌గా జరిగిన బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

సినీ పరిశ్రమలో వరుసగా వెడ్డింగ్ బెల్స్ మ్రోగుతున్నాయి.. కియారా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్రా.. హీరోయిన్ శివలీఖ ఒబెరాయ్ – ‘దృశ్యం’ (హిందీ) సిరీస్ చిత్రాల దర్శకుడు అభిషేక్ పాఠక్ వంటి వారు వివాహాలు చేసుకోగా.. నటి పూజా రామచంద్రన్ వంటి వారు సీమంతం పిక్స్ షేర్ చేసుకున్నారు.. షారుఖ్ ఖాన్ ‘చక్ దే ఇండియా’ లో నటించిన తాన్య అబ్రోల్.. తన ప్రియుడు ఆశిష వర్మను మ్యారేజ్ చేసుకుంది..

మరో ‘చక్ దే ఇండియా’ నటి చిత్రాశి రావత్.. తన బాయ్ ఫ్రెండ్, నటుడు ధ్రువ్ ఆదిత్యని వివాహ మాడింది. రీసెంట్‌గా కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అనూప్ గౌడ వెడ్డింగ్.. దీక్ష ఎస్ కుమార్ తో ఘనంగా జరిగింది. పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘యారి కూగడాలి’ (Yaare koogadali) సినిమా టైటిల్ సాంగ్‌లో డ్యాన్సర్ల బృందంలో ఒకడిగా కనిపించిన అనూప్.. ఆ తర్వాత పలు కన్నడ సినిమాలకు వివిధ విభాగాల్లో టెక్నీషియన్‌గా పని చేసి, నిర్మాతగా ఎదిగారు.

రమేష్ అరవింద్ హీరోగా ‘శివాజీ సురత్కల్’ (Shivaji Surathkal) అనే బ్లాక్ బస్టర్ ఫిలిం ప్రొడ్యూస్ చేసి.. దానికి పార్ట్ 2 కూడా తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 10న పాపులర్ స్పర్ష్ మసాలా (Sparsh Masala) మేనేజింగ్ డైరెక్టర్ అయిన దీక్షను పెళ్లాడారు అనూప్ గౌడ. పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి.. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వీరి వెడ్డింగ్ పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus