Ashwini Dutt: మాజీ ఏపీ సీఎంపై ‘కల్కి..’ నిర్మాత అశ్వినీదత్ షాకింగ్ కామెంట్స్.!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. కూటమి సునామిలో వైసీపీ కొట్టుకుపోయినట్లు అయ్యింది. గత ప్రభుత్వం సినీ పరిశ్రమని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టింది. కొత్త సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోవడంలో కావచ్చు, అదనపు షోలు విషయంలో అనుమతులు ఇవ్వకపోవడం..! ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాలు వస్తే.. దారుణంగా టికెట్ రేట్లు తగ్గించేయడం వంటివి మనం చూస్తూనే వచ్చాము. అంతేకాదు వైసిపి హయాంలో సినిమా స్టార్స్ ని బలవంతంగా వైజాగ్ కి షిఫ్ట్ అయిపోవాలని ఆదేశించడం కూడా జరిగింది.

అందులో తప్పేమీ లేదు.. కానీ బలవంతం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. సరే ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. తాజాగా జగన్ పై కల్కి నిర్మాత చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అశ్వినీదత్ (C. Aswani Dutt) మాట్లాడుతూ.. ‘జగన్ పతనాన్ని నేను ముందుగానే ఊహించడం జరిగింది. ఆంధ్రలో ఎక్కడికి వెళ్లినా ఆయనకు వ్యతిరేకంగా జనాలు మాట్లాడటం, సాధ్యమైనంత త్వరగా జగన్ దిగిపోవాలని .. వాళ్ళు కోరుకోవడాన్ని కళ్లారా చూశాను.

మొత్తానికి అనుకున్నదే జరిగింది. నిశ్శబ్దం ఎప్పుడూ ప్రమాదకరం. ఆంధ్రప్రదేశ్ ప్రజల సైలెన్స్ ని అప్పటి అధికార ప్రభుత్వం తక్కువ అంచనా వేసింది’ అంటూ అశ్వినీదత్ కామెంట్స్ చేశారు. ఎన్నికల టైంలో కచ్చితంగా కూటమి విజయం సాధిస్తుంది అని అశ్వినీదత్ ఎంతో ధీమాగా చెప్పారు. అప్పటివరకు టాలీవుడ్ ప్రముఖులు కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది లేదు. అశ్వినీదత్ వల్లే అంతా బయటపడ్డారు అనుకోవచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus