‘గీతా ఆర్ట్స్’ చిన బ్యానర్ అయిన ‘జిఏ2 పిక్చర్స్’ అధినేత నిర్మాత బన్నీ వాసు ఏకంగా గూగుల్ సీఈఓ అయిన సుందర్ పిచ్చాయికి లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ లెటర్ రాసి పోస్ట్ చేశారు బన్నీ వాస్. వివరాల్లోకి వెళితే.. కొంతకాలం నుండీ బన్నీ వాస్ ను ఓ యువతి ఆయన టార్చర్ పెడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె పై ఈయన పొలీసు కేసు పెట్టారు. మొన్నటికి మొన్న ఆమె ‘గీతా ఆర్ట్స్’ ఆఫీస్ కి వచ్చి సూసైడ్ చేసుకుంటాను అని కూడా బ్లాక్ మెయిల్ చేసి రచ్చ రచ్చ చేసింద. దాంతో పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ విషయం పై నిర్మాత బన్నీ వాస్ పై జరిగిన ట్రోలింగ్ కు గాను ఈయన చాలా బాద పడుతూ ఈ లేక రాసినట్టు స్పష్టమవుతుంది.
ఈ లేఖ ద్వారా బన్నీ వాస్ స్పందిస్తూ…” ‘గౌరవనీయులైన సుందర్ పిచాయి గారికి,
మీరు ఇంటర్నెట్ స్వేచ్ఛ మీద ప్రచురించిన అభిప్రాయాన్ని నేను చదవటం జరిగింది. గూగుల్ లాంటి అంతర్జాతీయ కంపెనీకి సీఈఓ అయిన మీరు ఎంతో ఆలోచనతో ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉంటారు అని నా నమ్మకం. ఈ విషయం మీద నా స్వీయానుభవం ఒకటి మీతో పంచుకోవటం కోసం ఈ ఉత్తరం రాస్తున్నాను.సామజిక మాధ్యమాలు ఉపయోగించటం మొదలుపెట్టిన రోజుల్లో నేను కూడా నా ఆలోచనా విధానాలు, భావాలూ పంచుకోటానికి ఇది మంచి వేదిక అని నమ్మాను, అలానే భావ ప్రకటనా స్వేచ్ఛకి, ఇంటర్నెట్ స్వేచ్ఛకు అవధులు ఉండకూడదని కచ్చితంగా అనుకున్నాను. ఈ నమ్మకంతోనే సామాజిక మాధ్యమాలను ఆనందంగా ఉపయోగించాను.కానీ గత రెండు సంవత్సరాలుగా బాధ్యతలేని భావ ప్రకటనా స్వేచ్ఛ, ఇంటర్నెట్ స్వేచ్ఛ వలన మానసికంగా నేను పడ్డ క్షోభను మీలాంటి వారికి చెప్పటం వలన సామజిక మాధ్యమాలలో భావ ప్రకటనా స్వేచ్ఛ, ఇంటర్నెట్ స్వేచ్ఛ మీద మీ ఆలోచన విధానంలో అభ్యుదయ మార్పు వస్తుందని నా నమ్మకం.ఇది ప్రభుత్వాలకో లేదా రాజ్యాలకో లేదా సమాజానికో సంబంధించిన విషయం అయితే వేరు కానీ, ఈ ఇంటర్నెట్ ఫ్రీడం చాటున ఉన్న సామాజిక మాధ్యమలలో లో ఒక వ్యక్తి యొక్క వ్యక్తికత జీవితానికీ, తన కుటుంబ పరువుకు సంబంధించిన విషయం అయితే, ఆ వ్యక్తికీ తన కుటుంబానికి జరిగే నష్టం నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . పైగా ఆ పరువు ఎంతమంది దగ్గర పోయిందో కూడా చక్కటి లెక్కలతో సహా చెబుతారు ఈ వేదిక నిర్వహించే కంపెనీలు. సామాజిక మాధ్యమాలలో ఉంటున్న వాళ్ళందరూ విచక్షణతో ఉంటున్నారా? విచక్షణ ఉన్న వాళ్ళనే సామాజిక మాధ్యమాలలోకి అనుమతిస్తున్నారా? ఈ ప్రశ్నని ఒకసారి మీరు మిమ్మల్ని అడిగి చూడండి ? సామాజిక మాధ్యమాలు అందరికి అందుబాటులో ఉంచాలి అని అన్నా, కనీసం విచక్షణ లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న వాళ్ళని కట్టడి చేయటానికి సమర్థవంతమైన విధానాలు ఉన్నాయా అంటే మీ దగ్గర సమాధానం ఉండదు అనేది జగమెరిగిన సత్యం. ఇదే కోవలో ఒక విచక్షణ లేని వ్యక్తి వలన ఇబ్బంది పడుతున్న నేను, నా కూతురు, దాని వల్ల నా కుటుంబానికి కలిగిన బాధ చూసిన వాడిగా ఈ ఉత్తరం రాస్తున్నాను. అబద్ధాలనూ అసత్యాలనూ పోస్టులు, వీడియోల రూపంలో పెట్టి ప్రజలను ఇబ్బంది పెడ్తున్న వాళ్ళది తప్పా ? అలాంటి వాళ్ళు చేస్తున్న క్రూరమైన పనులను నియంత్రించకుండా ప్రపంచం ముందు పెడుతున్న సామాజిక మాధ్యమాలది తప్పా? అని అడిగితే సామాజిక మాధ్యమాల ద్వారా కేవలం ఒక వేదిక అందించటం మాత్రమే మేము చేస్తున్నది అని ఈ వేదికలు తపించుకోవచ్చు, కానీ ఈ విచ్చలవిడి స్వేచ్చకి బలైపోతున్న మాలాంటి వాళ్ళకి సమాధానం ఇచ్చేది ఎవరు? న్యాయబద్దత, అవధులు, సరైన విచారణ లేని వార్తలు, పోస్టులు, కామెంట్లను అనుమతిస్తున్న ఇప్పటి సామజిక మాధ్యమాల వలన బలైన నేను, నా ఆరు సంవత్సరాల కూతురి ఆవేదనే ఈ ఉత్తరం” అంటూ ఇంకా చాలానే చెప్పుకొచ్చారు బన్నీ వాస్.
Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!