Bunny Vasu: పక్కనోడి సినిమాని ట్రోల్ చేస్తే.. మీ సినిమా హిట్ అవుతుంది అనుకోవడం తప్పు.. బన్నీ వాస్ సెన్సేషనల్ కామెంట్స్ ఎవరిపై?

ఈ దీపావళికి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ‘మిత్రమండలి’ ఒకటి. ఈ సినిమాకి బన్నీ వాస్ కూడా ఓ నిర్మాత. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఇందులో బన్నీ వాస్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ వాస్ మాట్లాడుతూ.. “ఈ అక్టోబర్ 16 నుండి వరుసగా 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 4 సినిమాలు కూడా బాగా ఆడాలి అని కోరుకుంటున్నాను. ఒక సినిమాని మించి మరో సినిమా ఆడాలని కోరుకుంటున్నాను.

Bunny Vasu

అయితే ఫస్ట్ బాల్ మేమె ఫేస్ చేస్తున్నాం కాబట్టి.. మేము దాన్ని సిక్స్ కొట్టడానికి రెడీగా ఉన్నాం. ఆ నమ్మకం మాకు ఉంది. అలాగే మా తర్వాత వచ్చే వాళ్ళు(మిగిలిన సినిమాలు) అన్నీ కూడా సిక్సులు కొట్టాలి. ఇండస్ట్రీ బాగుండాలి. అందరూ ఎదగాలి. అందరితో పాటు మనం కూడా ఎదగాలి. ఇలాగే నేను కోరుకుంటాను. నా వ్యవహారశైలి ఇలానే ఉంటుంది. అలా కాదు.. నేను ఒక సినిమాని తొక్కితేనే పక్క సినిమా ఎదుగుద్ది. నేను ఒక సినిమాని నెగిటివ్ గా ట్రోల్ చేస్తేనే పక్క సినిమా ఎదుగుద్ది అనుకుంటే.. అది మీ కర్మ.

మేమెవ్వరం ఏమీ చేయలేము. ఎందుకంటే సినిమా బాగుంటే చూస్తారు… బాగోకపోతే, మీదైనా మాదైనా ఎవ్వరిదైనా పక్కన పెట్టేస్తారు. ఇక్కడ మనం రెస్పెక్ట్ చేయాల్సింది ప్రేక్షకుల డెసిషన్ కి..! అంతేతప్ప.. ఇంకో సినిమా మీద నెగిటివ్ ట్రోల్స్ చేసేస్తే ఆ సినిమా తగ్గుద్ది.. ఆ సినిమా ఏదో అయిపోతాది అనుకుంటే,అది చిన్నపిల్లాడి తత్వం. బ్రదర్.. ఇక్కడ మనం అందరం ఇక్కడ ఉన్నది ఎదగడానికి.! ఎదుగుదాం..!కలిసి ఎదుగుదాం.

అంతే తప్ప ఒక సినిమా కోసం ఇంకో సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేస్తే.. ఏదో ఎదిగిపోతాం.. అనుకుంటే పైన దేవుడున్నాడు. చూసే ప్రేక్షకులు ఉన్నారు. వాళ్ళే చూసుకుంటారు అంతా” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే బన్నీ వాస్ ఏ సినిమా యూనిట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ కామెంట్స్ చేశారు.. అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

 

కృష్ణవంశీ, రవితేజ… ఇద్దరికీ అక్కడే చెడిందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus