తెలుగు చిత్ర పరిశ్రమకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే నంది అవార్డులు ఎంతో ప్రతిష్టాత్మకమైనవని చెప్పాలి. నంది అవార్డులను అందుకోవడం ప్రతి ఒక్క నటీనటులు ఆర్టిస్టులు ఎంతో గౌరవంగా భావిస్తారు.ఇలా కళా రంగాన్ని ప్రోత్సహిస్తూ కళాకారులకు ఎంతో గౌరవంగా ఇచ్చే నంది అవార్డులను గతంలో ప్రతి ఏడాది నిర్వహించేవారు. అయితే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ వేరుపడిందో అప్పటినుంచి నంది అవార్డుల ప్రస్తావన రాలేదని పలువురు సినీ సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చిత్ర పరిశ్రమకు ఎన్నో పురస్కారాలు ఉంటాయి కానీ ప్రభుత్వం తరఫున వచ్చే నంది అవార్డుకు మాత్రం ఎంతో గౌరవం ఉంటుందని ఆ అవార్డు అందుకోవడం ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఒక గౌరవంగా భావిస్తారని పలువురు నిర్మాతలు తెలియజేశారు. 2016 వ సంవత్సరం నుంచి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదని పలువురు నంది అవార్డుల గురించి స్పందించిన విషయం మనకు తెలిసిందే.
తాజాగా నంది అవార్డులపై నిర్మాత బన్నీ వాసు స్పందించి తన అభిప్రాయాలను తెలియజేశారు. ఇటీవల చిత్ర పరిశ్రమకు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును మనం అందుకున్నాము. ఆస్కార్ అవార్డు ఎంత ప్రతిష్టాత్మకమైనదో నంది అవార్డు కూడా అంతే విలువైనదని బన్నీ వాసు తెలియజేశారు.అలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఇవ్వడం పూర్తిగా మర్చిపోయాయని ఈయన తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
నంది అవార్డు అనేది తెలుగు చిత్ర పరిశ్రమ చేసుకుని ఒక పెద్ద పండుగ అని (Bunny Vasu) బన్నీ వాసు తెలిపారు. దయచేసి ఈ విషయంపై సినీ పెద్దలు కాస్త చొరవ తీసుకొని నంది అవార్డులను ప్రకటించాలని ఈ సందర్భంగా బన్నీ వాసు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకున్నారు. అయితే ఇదివరకే ఈ అవార్డుల గురించి నిర్మాత సి కళ్యాణ్, అశ్వినీ దత్, ఆదిశేషగిరిరావు, మురళీమోహన్ వంటి వారు కూడా ఈ అవార్డులపై స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేసిన విషయం మనకు తెలిసిందే.
బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!
అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు