Varun, Lavanya: ఆ ఇద్దరు స్టార్ హీరోలకు హ్యాట్సాఫ్.. చిట్టిబాబు కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నటుడు, నిర్మాత చిట్టిబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వరుణ్ తేజ్, లావణ్యల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. లావణ్య ఫ్యామిలీ గురించి, ఆమె ఆస్తుల గురించి చిట్టిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. లావణ్య త్రిపాఠిది రాయల్ ఫ్యామిలీ అని వరుణ్ లావణ్య సంతోషంగా ఉండాలని చిట్టిబాబు అన్నారు. నిహారిక గురించి నేను కామెంట్ చేయనని ఆయన తెలిపారు. వరుణ్, లావణ్య తెలివిగా లవ్ చేసుకున్నారని ఆయన తెలిపారు.

ఈరోజుల్లో భాష, మతంను పట్టుకుని వేలాడలేమని ఆయన తెలిపారు. వాళ్లు ఎంపిక చేసుకోవడం తప్పితే మనం ఎంపిక చేసిన వాళ్లను మన పిల్లలు పెళ్లి చేసుకోరని చిట్టిబాబు చెప్పుకొచ్చారు. లావణ్యకు భారీ స్థాయిలోనే ఆస్తులు ఉన్నాయని చిట్టిబాబు వెల్లడించారు. పబ్లిక్ మంచి కంటెంట్ సినిమాలనే కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ప్రతి జానర్ ను ఎంజాయ్ చేస్తారని చిట్టిబాబు అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్, బన్నీలకు హ్యాట్సాఫ్ అని వాళ్లు విభిన్నమైన కథలతో ఉన్న సినిమాలను ఎంచుకుంటున్నారని ఆయన తెలిపారు. మిగతా హీరోలు కూడా ఈ హీరోల పద్ధతిని ఫాలో అయితే బాగుంటుందని చిట్టిబాబు వెల్లడించడం గమనార్హం. అప్పట్లో క్రియేటివిటీలో పోటాపోటీ వల్ల విజయాలు దక్కాయని ఆయన అన్నారు.

ప్రేక్షకులు మంచి సినిమాలను చూస్తారని చిట్టిబాబు పేర్కొన్నారు. ఫ్యాన్స్ కోరారని చెప్పి హీరోలు సినిమాలు చేయడం కరెక్ట్ కాదని ఆయన తెలిపారు. అవన్నీ బోగస్ మాటలు అని చిట్టిబాబు అన్నారు. క్రైమ్, హాస్యం, సోషల్ డ్రామా ఇలా ఏ సినిమా చేసినా సినిమా నచ్చితే ప్రేక్షకులు ఆదరించారని ఆయన వెల్లడించారు. ప్రేక్షకులకు రంజింపచేసే సినిమాలు కావాలని చిట్టిబాబు తెలిపారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus