టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) చిన్న సినిమాలతో కూడా పెద్ద విజయాలు అందుకున్న సందర్భాలు ఉన్నాయి. ‘బొమ్మరిల్లు’ (Bommarillu) ‘కొత్త బంగారు లోకం’ (Kotha Bangaru Lokam) వంటి సినిమాలు దిల్ రాజు తక్కువ బడ్జెట్లో తీసి భారీ లాభాలు పొందారు. ఆయన తీసిన చిన్న సినిమాల్లో ‘ఆకాశమంత’ కి చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. ‘తండ్రీ, కూతుర్ల మధ్య సాగే ఓ ఎమోషనల్ డ్రామా ఇది. కూతురిపై తండ్రికి ఎలాంటి ప్రేమ ఉంటుంది..
కూతుర్ల విషయంలో తండ్రుల మైండ్ సెట్ ఎలా ఉంటుంది?’ వంటి సెన్సిటివ్ ఎలిమెంట్స్ తో చాలా సెన్సిబుల్ గా ఈ సినిమాని తీశారు. ఆ సినిమాలో తండ్రి పాత్రని ప్రకాష్ రాజ్ (Prakash Raj) , కూతురు పాత్రని త్రిష (Trisha) పోషించారు. అయితే వాళ్ళ కథని కదిపే పాత్రని జగపతి బాబు (Jagapathi Babu) పోషించారు. రాధా మోహన్ ఈ చిత్రానికి దర్శకుడు.
వాస్తవానికి ”ఆకాశమంత’ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వదు’ అని దిల్ రాజుకి షూటింగ్ టైంలో అనిపించిందట. అయితే మంచి సినిమా చేస్తున్నామనే భావనతో కంప్లీట్ చేశారట. అది కూడా తక్కువ బడ్జెట్లో..! కట్ చేస్తే సినిమా బాగానే ఆడింది. తక్కువ రేట్లకే ఇవ్వడం వల్ల ఎక్కడా నష్టాలు రాలేదు. పైగా దిల్ రాజుని అంతా ప్రశంసించారు. ఇక ఈ సినిమాలో పాత్ర కోసం జగపతి బాబుని..
దిల్ రాజు అడిగినప్పుడు. వెంటనే నేను చేస్తాను..అని చెప్పాడట. తర్వాత పారితోషికం గురించి అడగ్గా.. ‘నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. ఓ మంచి సినిమాలో నన్ను భాగం చేస్తున్నావ్ చాలు’ అని జగపతి బాబు… దిల్ రాజుకు చెప్పారట. దీంతో దిల్ రాజుకి కన్నీళ్లు వచ్చాయట. తర్వాత జగపతి బాబు నటించిన ‘హోమం’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి అతని ఋణం తీర్చుకున్నట్లు స్పష్టమవుతుంది.