టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు దిల్ రాజు. ఆయన సినిమా నిర్మించాడు అంటే అది హిట్టే అని ప్రేక్షకులు బలంగా ఫిక్సయిపోయారు. సో సినిమా యావరేజ్ గా ఉన్నా అది బ్లాక్ బస్టర్ గా నిలబెట్టే స్టామినా దిల్ రాజు కు ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆయనకి ఎప్పటి నుండో ఓ కోరిక ఉందట. ఆయన బ్యానర్లో.. ఇతర భాషల్లో కూడా సినిమాలు నిర్మించాలని ఆయన కోరిక…! ఇప్పటివరకూ ‘గీత ఆర్ట్స్’ అధినేత అల్లు అరవింద్ మాత్రమే అలాంటి ఫీట్ ను సాధించారు. సక్సెస్ కూడా అయ్యారు. ఇప్పుడు దిల్ రాజు కూడా ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘భారతీయుడు-2’ సీక్వెల్ నిర్మించాలని ప్లాన్ చేసినా.. వర్కౌట్ కాలేదు.
ఈ సంవత్సరం తన నిర్మాణంలో వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘ఎఫ్ 2’ చిత్రాన్ని బోనీకపూర్ తో కలిసి బాలీవుడ్లో రీమేక్ చేయబోతున్నాడు దిల్ రాజు. అంతేకాదు ‘జెర్సీ’ చిత్రాన్ని కూడా హిందీలో రీమేక్ చేయడానికి దిల్ రాజు ప్రయత్నిస్తున్నట్టు కూడ టాక్ నడుస్తుంది. కరణ్ జోహార్ ‘జెర్సీ’ హిందీ రీమేక్ హక్కులను కొనుగోలు చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిని బట్టి చూస్తుంటే కరణ్ జోహార్ తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకూ నిజముందో తెలియాల్సి ఉంది.