Nani: నానికి గిఫ్ట్ ఇస్తే అలా చేశాడన్న ప్రొడ్యూసర్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే నటులలో నాని ఒకరనే సంగతి తెలిసిందే. గతంలో దర్శకనిర్మాతలు నాని గురించి ఆరోపణలు చేసిన సందర్భాలు లేవు. అయితే నానితో పిల్ల జమిందార్ సినిమాను నిర్మించిన నిర్మాత డీఎస్ రావు నానికి కృతజ్ఞత లేదని అర్థం వచ్చేలా కామెంట్లు చేశారు. చిన్నసినిమాలను ఎక్కువగా నిర్మించిన డీఎస్ రావ్ కు పిల్ల జమిందార్ సినిమా నిర్మాతగా ఇండస్ట్రీలో గుర్తింపుతో పాటు లాభాలను తెచ్చిపెట్టింది. యాంకర్ నిర్మాతను మీరు ఎక్కువగా హీరోహీరోయిన్లకు డబ్బులు ఇవ్వకుండా గిఫ్ట్ లు ఇస్తుంటారట నిజమేనా..?

అని ప్రశ్నించగా హీరోహీరోయిన్లకు ఏమిచ్చినా వేస్ట్ అని డీఎస్ రావు అన్నారు. నానికి పిల్ల జమిందార్ ఓవర్సీస్ రైట్స్ గిఫ్ట్ గా ఇచ్చానని నాని తన బావ ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారని చెప్పడంతో ఓవర్సీస్ హక్కులను గిఫ్ట్ గా ఇచ్చినట్టు డీఎస్ రావు తెలిపారు. నానికి రెమ్యునరేషన్ మొత్తం ఇచ్చి ఓవర్సీస్ హక్కుల కోసం రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. నాని మేనేజర్ వచ్చి ఓవర్సీస్ రైట్స్ కు ఎంత ఇవ్వమంటారని అడిగారని పర్లేదు నేను హ్యాపీగా ఉన్నానని నాని మేనేజర్ తో చెప్పానని డీఎస్ రావు పేర్కొన్నారు.

అయితే ఆ తరువాత నాని మాటవరసకు కూడా ఎంత డబ్బు వచ్చిందనే విషయం తనకు చెప్పలేదని డీఎస్ రావు వెల్లడించారు. చాలామంది నిర్మాతలు తమకు జరిగిన ఘటనల విషయంలో బయటపడరని డీఎస్ రావు తెలిపారు. తనకు పెద్ద సపోర్టర్స్ ఉన్న సమయంలో చిన్నచిన్న హీరోలతో సినిమాలు చేసి తప్పు చేశానని డీఎస్ రావు చెప్పుకొచ్చారు.


ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus