DVV Danayya: వైరల్ అవుతున్న డీవీవీ దానయ్య కామెంట్స్.. చరణ్ గ్రేట్ యాక్టర్ అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో రామ్ చరణ్(Ram Charan)  ఒకరు కాగా రామ్ చరణ్ సక్సెస్ రేట్ చాలామంది హీరోలతో పోల్చి చూస్తే ఎక్కువ అనే సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ (Game Changer)  సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమా డిసెంబర్ నెల 20వ తేదీన విడుదల కానుండగా ఈ సినిమా చరణ్ ఫ్యాన్స్ కోరుకునే రేంజ్ లో హిట్టవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

DVV Danayya

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాతలలో డీవీవీ దానయ్య  (D. V. V. Danayya) ఒకరు కాగా దానయ్య ఒక సందర్భంలో చరణ్ యాక్టింగ్ స్కిల్స్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చరణ్ లోని యాక్టింగ్ స్కిల్స్ ను అద్భుతంగా ఎలివేట్ చేసిన సినిమాలలో రంగస్థలం సినిమా ఒకటి కాగా రంగస్థలం (Rangasthalam) సెట్ కు వెళ్లిన సమయంలో చరణ్ యాక్టింగ్ చూసి నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయని దానయ్య తెలిపారు.

చరణ్ గ్రేట్ యాక్టర్ అని దానయ్య పరోక్షంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ సమయంలో రంగస్థలంతో రామ్ చరణ్ పెద్ద హిట్ కొట్టబోతున్నారని నాకు అనిపించిందని నా అంచనా నిజమైందని ఆయన అన్నారు. 2006 సంవత్సరంలో రాజమౌళికి (S. S. Rajamouli) అడ్వాన్స్ ఇచ్చానని త్రివిక్రమ్ (Trivikram)  కు కూడా కెరీర్ తొలినాళ్లలోనే అడ్వాన్స్ ఇచ్చానని దానయ్య చెప్పుకొచ్చారు. మెగా హీరోలతో ఎక్కువ సినిమాలను నిర్మించిన నిర్మాతగా దానయ్యకు పేరుంది.

చరణ్ దానయ్య కాంబోలో వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama) , ఆర్.ఆర్.ఆర్ (RRR) సినిమాలు రాగా ఈ సినిమాలలో వినయ విధేయ రామ డిజాస్టర్ గా నిలిస్తే ఆర్.ఆర్.ఆర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చరణ్ హీరోగా దానయ్య నిర్మాతగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు రావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చరణ్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ త్వరలో రానున్నాయని తెలుస్తోంది.

పవన్ పీఎం అవుతారంటూ జానీ మాస్టర్ కామెంట్స్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus