దాదాపుగా మూడున్నరేళ్లు షూటింగ్ జరుపుకున్న ఆర్ఆర్ఆర్ ఎట్టకేలకు థియేటర్లలో విడుదలవుతోంది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమా మొదటిరోజు టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో లేవు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఫస్ట్ వీకెండ్ వరకు ఆర్ఆర్ఆర్ టికెట్ల బుకింగ్ దాదాపుగా పూర్తైంది. కొంతమంది మాత్రం ఆర్ఆర్ఆర్ టాక్ వెల్లడైన తర్వాత సినిమాను థియేటర్లలో చూద్దామని వేచి చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీగా అంచనాలు నెలకొనడంతో పాటు జక్కన్న సినిమాలు ఇప్పటివరకు నష్టాలను మిగల్చకపోవడంతో బయ్యర్లు ఈ సినిమా కోసం భారీ మొత్తం ఖర్చు చేశారు.
అయితే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వల్ల ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యమైంది. ఫలితంగా బయ్యర్లకు వడ్డీల రూపంలో భారం పెరిగింది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు కొన్ని గంటలే ఉండగా ఈ సినిమా బయ్యర్లు తెగ టెన్షన్ పడుతున్నారు. ఆర్ఆర్ఆర్ కు యునానిమస్ పాజిటివ్ టాక్ రావాలని వాళ్లు కోరుకుంటున్నారు. అప్పట్లో అడ్వాన్స్ లు ఇచ్చిన బయ్యర్లు ప్రస్తుతం బ్యాలెన్స్ మొత్తాలను కట్టాల్సి ఉంది.
కొంతమంది బయ్యర్లు దానయ్యను డిస్కౌంట్ అడుగుతుండగా దానయ్య మాత్రం వన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారని సమాచారం. కొంతమంది బయ్యర్లు జక్కన్న సహాయంతో డిస్కౌంట్ అడిగే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. రిలీజ్ కు ముందు బయ్యర్లలో టెన్షన్ నెలకొన్నా రిలీజ్ తర్వాత పరిస్థితి మారుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో విడుదలైన పెద్ద సినిమాలు ఫుల్ రన్ లో నష్టాలను మిగిల్చిన నేపథ్యంలో బయ్యర్లు టెన్షన్ పడుతున్నారు.
అయితే ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత పరిస్థితి మారుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చరణ్, ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా రికార్డుస్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం ఖాయమని నమ్ముతున్నారు. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!