Pushpa2: ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన పుష్ప2 నిర్మాత!

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప ది రైజ్ ఏ స్థాయిలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప ది రూల్ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప ది రైజ్ సినిమాకు సీక్వెల్ గా పుష్ప ది రూల్ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. అయితే గత కొన్నిరోజులుగా పుష్ప ది రూల్ లో రష్మిక పాత్ర చనిపోతుందని వార్తలు వస్తున్నాయి.

పుష్ప సినిమా ఫ్యాన్స్ సైతం వైరల్ అవుతున్న వార్తలు నిజం కావచ్చని భావిస్తున్నారు. అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి పుష్ప సినిమా నిర్మాతలలో ఒకరైన వై.రవిశంకర్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. అదంతా నాన్సెన్స్ అని చెత్త అని వాస్తవానికి పుష్ప2 సినిమా కథ తమకు సరిగ్గా తెలియదని ఆయన చెప్పుకొచ్చారు. వైరల్ అవుతున్న వార్తలు వట్టి ఊహాగానాలు మాత్రమేనని ఆయన కామెంట్లు చేశారు.

టీవీ ఛానెళ్లు, వెబ్ సైట్లు ఒక్కో సమయంలో సినిమాల గురించి ఇదే విధంగా రాస్తాయని వాటి గురించి చదివే వాళ్లకు ఏం తెలియదు కాబట్టి నమ్ముతారని ఆయన పేర్కొన్నారు. పుష్ప2 సినిమా బడ్జెట్ 400 కోట్ల రూపాయలు అని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఈ వార్తల్లో వాస్తవాలు తెలియాల్సి ఉంది. ఆగష్టు నెలలో ఈ సినిమా షూట్ మొదలుకానుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

సుకుమార్ ప్రస్తుతం పుష్ప2 స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నారు. మరోవైపు బన్నీ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఐకాన్ సినిమా దాదాపుగా ఆగిపోయినట్టేనని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. బన్నీ తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో చూడాల్సి ఉంది. పుష్ప ది రూల్ పుష్ప ది రైజ్ ను మించి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus