Mahesh Babu: మహేష్ మూవీ బడ్జెట్ రివీల్ చేసిన నిర్మాత.. ఆ రేంజ్ లో ఖర్చు చేస్తారా?

మహేష్ (Mahesh Babu) రాజమౌళి (SS Rajamouli) కాంబో మూవీకి సంబంధించిన అప్ డేట్స్ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీకి కేఎల్ నారాయణ నిర్మాత కాగా ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన క్లారిటీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేఎల్ నారాయణ (KL Narayana) చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కేఎల్ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేఎల్ నారాయణ మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా నేను నిర్మాతగా విరామం తీసుకోలేదని ఆయన అన్నారు.

15 సంవత్సరాల క్రితమే జక్కన్న మహేష్ కాంబినేషన్ ను ఫిక్స్ చేశామని కేఎల్ నారాయణ వెల్లడించారు. ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళి క్రేజ్ మరో స్థాయిలో ఉందని ఆయన కామెంట్లు చేశారు. అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి మహేష్, జక్కన్న సినిమా చేస్తున్నారని కేఎల్ నారాయణ వెల్లడించారు. నేను చెప్పకపోయినా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో మూవీ తీయనున్నట్టు వాళ్లే ప్రకటించారని ఆయన అన్నారు. అందుకు వాళ్లకు కృతజ్ఞుడినని కేఎల్ నారాయణ పేర్కొన్నారు.

రాజమౌళికి హాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయని అయినా వాటిని వదులుకుని నాకోసం సినిమా చేస్తున్నారని ఆయన వెల్లడించారు. రెండు నెలల నుంచి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయని కేఎల్ నారాయణ చెప్పుకొచ్చారు. రాజమౌళి ప్రతి విషయాన్ని నిర్మాతలతో పంచుకుంటారని ఆయన తెలిపారు. ఈ సినిమాకు బడ్జెట్ ఇంకా డిసైడ్ చేయలేదని సినిమాకు ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టడానికి సిద్ధమని నిర్మాత కామెంట్లు చేశారు.

ఆర్.ఆర్.ఆర్ (RRR) తర్వాత మూవీ కాబట్టి ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకుని సినిమాను ప్లాన్ చేస్తున్నామని కేఎల్ నారాయణ వెల్లడించారు. కేఎల్ నారాయణ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆగష్టు లేదా సెప్టెంబర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus