Jr NTR: తారక్ నటించిన ఆ మూవీ ఫ్లాప్ రిజల్ట్ అందుకోవడం వెనుక రీజన్ ఇదేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR) బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ లో తెరకెక్కిన ఏకైక సినిమా దమ్ము (Dammu) కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఫస్టాఫ్ అదుర్స్ అనేలా ఉన్నా సెకండాఫ్, క్లైమాక్స్ విషయంలో జరిగిన కొన్ని పొరపాట్లు సినిమా ఫ్లాప్ కు కారణమయ్యాయి. ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ గా త్రిష నటించగా ఎన్టీఆర్, త్రిష (Trisha) జోడీ విషయంలో నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. సింహా (Simha) సినిమాతో సక్సెస్ సాధించిన బోయపాటి శ్రీను దమ్ము సినిమాతో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేసే విషయంలో ఫెయిల్ అయ్యారు.

Jr NTR

ఈ సినిమా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రామారావు (K. S. Rama Rao) నిర్మాతగా తెరకెక్కగా ప్రేక్షకులను ఈ సినిమా రిలీజ్ సమయంలో విపరీతంగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. దమ్ము మంచి సినిమా కాదని ఎవరైనా చెబితే తాను అంగీకరించనని కేఎస్ రామారావు వెల్లడించారు. అద్భుతమైన కథాంశంతో ఆ సినిమా తెరకెక్కిందని కేఎస్ రామారావు చెప్పుకొచ్చారు. కొన్ని రీజన్స్ వల్ల ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదని కేఎస్ రామారావు అభిప్రాయపడ్డారు.

అప్పటి రాజకీయ పరిస్థితుల వల్ల ఈ సినిమాపై నెగిటివిటీ స్ప్రెడ్ అయిందని కేఎస్ రామారావు కామెంట్లు చేశారు. తెలంగాణ ఉద్యమం ఎఫెక్ట్, సుమన్ రోల్ కూడా సినిమాపై ప్రభావం చూపాయని ఆయన తెలిపారు. చాలా సినిమాలతో పోల్చి చూస్తే దమ్ము కమర్షియల్ గా బెస్ట్ మూవీ అని కేఎస్ రామారావు కామెంట్లు చేశారు.

ఈ సినిమాలో మొదట శృతి హాసన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినా డేట్ల సమస్య వల్ల ఆమె ఈ సినిమాలో నటించలేదని కేఎస్ రామారావు పేర్కొన్నారు. కేఎస్ రామారావు చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. దమ్ము సినిమా ఫ్లాప్ కు కేఎస్ రామారావు చెప్పిన రీజన్లు సైతం సరైనవే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

‘దేవర’ వర్సెస్‌ ‘భైర’.. ఈ వైరం వెనుక చాలా విషయాలున్నాయా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus