సినిమా ఇండస్ట్రీ కష్టాల్లో ఉంది, నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నారు.. ఇది ఇలానే కొనసాగితే కష్టం అంటూ ఆ మధ్య నెల రోజులపాటు సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. ఆ తర్వాత నిర్మాతలు చర్చించుకుని.. సినిమా వర్గాల వారితో డిస్కస్ చేసి కొన్ని నిర్ణయాలు వెల్లడించారు. వాటికి అనుగుణంగా సినిమాల షూటింగ్‌లు రీస్టార్ట్ చేశారు. అయితే అన్ని రోజులు ఆపి నిర్మాతలు ఏం సాధించారు, చిన్న నిర్మాతలకు ఏం చేశారు అంటూ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ప్రశ్నించారు. ఈ మేరకు ఫిలిం ఛాంబర్‌కు ఓ లేఖ కూడా రాశారు.
క్యూబ్, యు.ఎఫ్.ఒ లాంటి డిజిటల్ ప్రొవైడర్ల ఛార్జీలు చిన్న సినిమాల పాలిట శాపంగా మారాయని ఆ లేఖలో నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల చిత్రీకరణలు నిలిపివేసి చిన్న నిర్మాతలకు ఏం న్యాయం చేశారో చెప్పాలనితెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు, కార్యదర్శికి నట్టి కుమార్ లేఖ రాశారు. క్యూబ్, మల్టీప్లెక్స్‌ల్లో (పీవీఆర్ తదితర వాటిలో ) ఒక్క షో వేసినా, ఏడు షోలు పడినా రూ. 9,800 చెల్లించాల్సి వస్తోంది.
సినీ పొలిస్‌లో అయితే రూ.7,080 చెల్లించాలి. ఈ ధర చిన్న సినిమాలకూ ఇది వర్తిస్తుంది. ఇంత డబ్బు చెల్లించటం చిన్న సినిమా నిర్మాతలకు భారమే. మల్టీప్లెక్స్‌ల్లో 35 టికెట్లు అమ్ముడు పోతేనే సినిమాలు వేస్తున్నారు. అంతమంది ప్రేక్షకులు రాకపోతే, ఎవరికీ చెప్పకుండా అక్కడి నుండి సినిమా తీసేస్తారు. అసలు సినిమాల షూటింగ్‌ను ఆపేసి 30 రోజులపాటు మీరు ఏం చేశారు? అసలు చిన్న సినిమాల నిర్మాతల సమస్యలు ఎప్పుడు తీరుతాయి అని నట్టి కుమార్ లేఖలో ప్రశ్నించారు. దీంతోపాటు ఫెడరేషన్ సమస్యలపైనా లేఖలో ప్రస్తావించారు.
ఫెడరేషన్‌లోని వారికి చిన్న సినిమాల చిత్రీకరణలకు సంబంధించి 25 శాతం ధరలు తగ్గిస్తామని 10 ఏళ్లుగా చెబుతున్నారు. అయితే ఇటీవల 15 శాతం రేట్లు పెంచారు. ఇది ఏ విధంగా సబబు అని ప్రశ్నించారు. ప్యాషన్ ఉన్న కొంతమంది చిన్న సినిమా నిర్మాతలు సమస్యలు అధిగమించి, ఎదురు డబ్బులిచ్చి… తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇలా అందరూ చేయలేరు కదా. ఛాంబర్ పెద్దలు వీటన్నింటికీ సమాధానం చెప్పాలి’’ అని నట్టి కుమార్ లేఖలో పేర్కొన్నారు.
Most Recommended Video
ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!