RRR సినిమా పై ప్రస్తుతం అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాపై పెట్టుబడులు పెట్టేందుకు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ గా మారుతున్నారు. గత కొంతకాలంగా చాలామంది నిర్మాతలు నిర్మాతతో కంటే రాజమౌళితోనే ఎక్కువగా చర్చలు జరుపుతున్నారు. డివివి దానయ్య 450 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను బ్రేక్ చేస్తుంది అని అందరు నమ్ముతున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 800 వందల కోట్లకు పైగానే చేరినట్లు తెలుస్తోంది. నిర్మాత దానయ్య చాలావరకు సినిమాను కొన్ని ఏరియాలలో అవుట్ రెట్ ధరకు అమ్మేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల భీమ్లా నాయక్ నిర్మాత RRR బిజినెస్ లో భాగం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మల్టీస్టారర్ సినిమాను ఓవర్సీస్ లో కూడా భారీగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే సినిమా ఆస్ట్రేలియా రిలీజ్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ సొంతం చేసుకున్నట్లు సమాచారం. దాదాపు 6 కోట్లకు పైగా సినిమా రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఒక వైపు నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా కూడా మంచి లాభాలను అందుకుంటున్న నాగ వంశీ రీసెంట్ గా డీజే టిల్లు సినిమా తో పాటు భీమ్లా నాయక్ తో కూడా నాగవంశీ భారీ స్థాయిలో సక్సెస్ అందుకున్నాడు.
మొత్తంగా నాగవంశీ మంచి లాభాలను అందుకుంటున్నాడు. RRR ను తెలుగు సినిమాను ఆస్ట్రేలియాలో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు. సినిమా హడావిడి చూస్తూ ఉంటే 6 కోట్ల టార్గెట్ ను అందుకోవడం పెద్దగా కష్టం కాదని అనిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడులకు అందరికీ కూడా ఈ సినిమా మంచి ప్రాఫిట్స్ అందిస్తుంది అని కూడా అర్థమవుతుంది. మరి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఏ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తారో చూడాలి.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!