Naga Vamsi: తారక్‌ – నెల్సన్‌ సినిమా.. వారి ఊహలకు బ్రేక్‌ వేసిన నిర్మాత నాగవంశీ!

‘వార్‌ 2’ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ (Jr NTR) ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel) సినిమాలో నటిస్తాడు అనే విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ అయి చాలా రోజులు అయింది. అయితే ప్రశాంత్‌ నీల్‌ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఇప్పుడు ప్రారంభమవుతుంది అని అంటున్నారు. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ లేదు అనుకోండి. ఈ క్రమంలోనే తారక్‌ మరో సినిమాను ఓకే చేశాడు అంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో షికార్లు చేసింది.

Naga Vamsi

అనుకున్నట్లుగా ఆ పుకార్లలోని దర్శకుడు ఇటీవల తారక్‌తో కలసి ఓ ఈవెంట్‌లో కనిపించారు. దీంతో ఇంకేముంది ఇద్దరి సినిమా ఫిక్స్‌ అయింది, అందుకే ఆ డైరెక్టర్‌ వచ్చారు అంటూ కొత్త కథలు అల్లేశారు. అంతేకాదు ఆ సినిమా నిర్మాత ఓకే అనేశారు త్వరలో ప్రారంభం అనేలా కూడా చెప్పారు. అయితే తాజాగా ఈ సినిమా విషయంలో నిర్మాతే క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇద్దామనుకున్న హైప్‌ దిగిపోయింది.

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అని ఓ సామెత ఉంది మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు తారక్‌ – నెల్సన్‌ ప్రాజెక్ట్‌ గురించి చూస్తే అదే మాట అనాలని అనిపిస్తోంది. ఎందుకంటే ఇంతవరకు తారక్‌కు నెల్సన్‌ (Nelson Dilip Kumar) కథే చెప్పలేదు. త్వరలో అంతా ఓకే అనుకుంటే ఎన్టీఆర్‌కు నెల్సన్‌ కథ వినిపిస్తామని ఆ సినిమాకు రూమర్డ్ నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) చెప్పేశారు. అంటే ఈ ప్రాజెక్ట్‌ విషయంలో ఇంకా ఒక్క అడుగు కూడా పడలేదు.

నెల్సన్ – ఎన్టీఆర్ సినిమా కథపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఎన్టీఆర్‌తో నెల్సన్‌ సినిమా అని ఓ మాట అనుకున్నామందతే. నెల్సన్ ప్రస్తుతం కథ రాస్తున్నారు. త్వరలో తారక్‌ను కలుస్తారు. కథ చెప్పాక, నచ్చాక ఆ సినిమాని ఎలా లాంచ్ చేయాలి, ఏ రేంజ్ లో ప్లాన్ చేయాలి లాంటి అంశాల గురించి ఆలోచిస్తాం అని నాగవంశీ చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఒకవేళ ఉంటే.. ‘జైలర్ 2’ (Jailer) తర్వాతే స్టార్ట్‌ చేస్తారు అని టాక్‌.

మర్యాద రామన్న టైంలో ట్వీటేస్తే.. ఆర్ఆర్ఆర్ తర్వాత సెట్ అయ్యింది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus