ఏదైనా ఒక విషయాన్ని ధృఢమైన సంకల్పంతో కోరుకోవడం అనేదాన్ని ఇంగ్లీషులో “మ్యానిఫెస్టేషన్” అని, తెలుగులో “అభివ్యక్తీకరణ” అంటారు. ఈ అభివ్యక్తీకరణ అందరూ చేసేదే. అయితే.. మహేష్ బాబు (Mahesh Babu) 2010లో చేసిన ఒక అభివ్యక్తీకరణ సరిగ్గా 15 ఏళ్ల తర్వాత నెరవేరనుంది. రాజమౌళి (S. S. Rajamouli) “మర్యాద రామన్న” (Maryada Ramanna) రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న తరుణంలో మహేష్ బాబు మే 22, 2010లో “నేను రాజమౌళి కలిసి పనిచేయనున్నాం, ఎట్టకేలకు” అంటూ ట్వీట్ చేశాడు.
ఆ తర్వాత రాజమౌళి “ఈగ” (Eega) సినిమా టేకప్ చేయడం, ఆ తర్వాత “బాహుబలి” (Baahubali) కోసం ఏకంగా అయిదేళ్లు అర్పించేయడం కారణంగా.. మహేష్ బాబు వేసిన ట్వీట్ మరుగునపడిపోయింది. ఈ పదిహేనేళ్ల కాలంలో ఆ ట్వీట్ ను గుర్తించినవాళ్ళు కూడా లేరు. కానీ.. “ఆర్ఆర్ఆర్” (RRR Movie) తర్వాత రాజమౌళి స్వయంగా మహేష్ బాబుతో సినిమా ఎనౌన్స్ చేయడం, అది ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానుల కల ఎట్టకేలకు నేడు (జనవరి 02, 2025)కి నెరవేరడం అనేది మామూలు విషయం కాదు.
అంటే.. మహేష్ బాబు తాను హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని ఎంత ధృఢంగా అంతఃకరణ శుద్ధితో కోరుకున్నాడు అనేది ఇవాళ ప్రారంభోత్సవ వేడుక చూసాక అర్థమైంది. రెండు భాగాలుగా రూపొందే ఈ చిత్రం మొదటి భాగం 2028లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ చిత్రంలో హీరోయిన్ & సపోర్టింగ్ క్యాస్ట్ ఎవరు అనేది మరికొద్ది రోజుల్లో తెలియనుండగా.. ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్రికాలో మొదలవ్వనుంది. మొత్తం ఆరు దేశాల్లో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రానికి హాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ కూడా భాగస్వామికానుంది. పలువురు హాలీవుడ్ నటులు మరియు టెక్నీషియన్లు కూడా ఈ చిత్రంలో భాగస్వామ్యం కానున్నారు.
4 all u people there’s sum really good news:)looks like Rajamouli n Me r finally working together:)FINALLY 🙂
— Mahesh Babu (@urstrulyMahesh) May 22, 2010